
చాలా మందికి నోటి పూతల సమస్య తరచూగా వేధిస్తూ ఉంటుంది. పేగు పనితీరు సరిగా లేకపోవడం, వేడి, ఇతర కారణాల వల్ల ఈ పూతల సంభవించవచ్చు. కొన్నిసార్లు, నోటి పూతల వల్ల తినడం, తాగడం కష్టమవుతుంది. నోటి పూతల సమస్యను తగ్గించుకోవాలనుకుంటే, మీరు ఉదయం ఖాళీ కడుపుతో లేత జామ ఆకులను నమలటం అలవాటుగా చేసుకోంది.

జామ ఆకులు దగ్గు నుండి ఉపశమనం కలిగించడంలో, గొంతు నుండి శ్లేష్మం తొలగించడంలో సహాయపడతాయి. ఉదయం ఖాళీ కడుపుతో వాటిని నమలడం వల్ల గొంతు చికాకు తగ్గుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో జామ ఆకులను నమలడం వల్ల జీర్ణ, కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

జామ ఆకులలో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. రక్తపోటు రోగులు ఖాళీ కడుపుతో వీటిని తినవచ్చు. అయితే, ఏదైనా ఆహారంలో మార్పులు చేసే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.

మీరు బరువు తగ్గాలని చూస్తున్నట్లయితే, జామ ఆకులు సహాయపడతాయి. జామ ఆకులలో ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో కార్బోహైడ్రేట్ శోషణను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

జామ ఆకు చెడు కొలెస్ట్రాల్ కూడా నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. జీర్ణ ఆరోగ్యానికి కూడా ఈ ఆకు తోడ్పడుతుంది. ఇది ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది సీజనల్ జబ్బులు రావు. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. జామ ఆకు రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది.