
Cardamom

యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి, వ్యాధుల నుంచి రక్షిస్తాయి. యాలకులు మెదడుకు రక్త ప్రసరణను పెంచి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. క్యాన్సర్‌ను నివారించడంలో కూడా యాలకులు సమర్థవంతంగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. యాలకులలో ఉన్న యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

Cardamom

యాలకులు తినటం జీవక్రియను పెంచుతుంది. మానసిక ఒత్తిడిని నియంత్రించటంతోపాటు మూత్రపిండాల్లో రాళ్ళను కరిగిస్తాయి. ఉదర సంబంధిత వ్యాధుల నివారణకు యాలకులు చక్కని పరిష్కారంగా పనిచేస్తుంది. యాలకులతో ఒత్తిడి తగ్గుతుంది. మెదడులో సెరోటోనిన్ స్థాయిలను పెంచడం ద్వారా ఇది పనిచేస్తుంది.

రాత్రి భోజనం తర్వాత యాలకులు నమలడం వల్ల జీర్ణక్రియ బలపడుతుంది. అలాగే వికారం, వాంతుల వంటి సమస్యల నివారణకు కూడా యాలకులను సహజ ఔషధంగా వాడతారు. యాలకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగానే కాకుండా, సౌందర్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉన్న విటమిన్లు, ఫైటో న్యూట్రియంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి జుట్టుని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని వివరిస్తున్నారు.