Amudham: ఆముదం మొక్కకు సంబంధించిన ఈ రహస్యం మీకు తెలుసా..? అందంతో పాటు ఆరోగ్యం..

|

Dec 10, 2023 | 2:32 PM

Castor Oil Benefits: మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక రకాలైన ఆయుర్వేద మొక్కలు కూడా ఉన్నాయి. అందులో ఆముదం మొక్క కూడా ఒకటి. ఈ మొక్కలు ఎన్నో రకాల ఔషధ గుణాలు నిండి ఉంటాయి. ఈ మొక్కను వివిధ రకాల అనారోగ్య సమస్యలకు వినియోగిస్తుంటారు ఆయుర్వేద వైద్యులు.

1 / 5
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ మొక్కను పంచాంగుల, ఏరండ అని కూడా పిలుస్తారు. ఈ మొక్కలోని ప్రతిభాగం ఆయుర్వేద గుణాలతో నిండి ఉంటుంది. ఈ చెట్టు కాయల నుంచి వచ్చే గింజలతో నూనెను కూడా తీస్తారు. ఆముదం గింజలతో తయారు చేసే ఆయిల్‌ను ఆముదం నూనెగా పిలుస్తారు.

2 / 5
గతంలో  వంటల్లో ఎక్కువగా ఈ ఆముదం నూనెను వినియోగించేవారు. ఆముదం నూనెతో తయారుచేసిన ఆహారాలను తినడం వల్ల కడుపులో తయారయ్యే నులి పురుగుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.

3 / 5
మూల వ్యాధులతో బాధపడేవారికి ఆముదం మొక్క ఆకులు ప్రభావంతంగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధితో బాధపడేవారు ఆకులను నూరి అందులోనే కర్పూరం కలిపి కట్టుకట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు

4 / 5
ఆముదం నూనెను జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది. దాంతోపాటుగా జుట్టు రాలడం సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

5 / 5
ఆముదం నూనెలో వాటి ఆకులను బాగా వేడి చేసి నొప్పులు ఉన్న ప్రదేశాల్లో కట్టుకట్టడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది. వాపు వంటి సమస్యలు సులభంగా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజు ఈ ఆముదం నూనెను అప్లై చేసి మసాజ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.