
ఈ మధ్యకాలంలో చింత చిగురుకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్లో కేజీ ధర ఆకాశాన్ని తాకుతోంది. రూ. 400 నుంచి 500 పలుకుతుంది. మీరు వీటితో కూర, పప్పు, పులుసు చేయడం చూసారు. ఇంకా వీటిని తీసుకుని పచ్చి మిర్చి తో కానీ ఎండు మిరపకాయలతో కానీ వీటిని వేయించి చేస్తే టేస్ట్ అదిరిపోతోంది. ఆంధ్రాలో ఇది చాలా ఫేమస్. ఇంకా పుల్లపుల్లగా కారంగా తినేకొద్ది తినాలనిపిస్తుంది. వేడి వేడి అన్నంలోకి దీనిని తింటే అస్సలు వదలరు.

చింత చిగురు పచ్చడికి కావాల్సిన పదార్ధాలు : రెండు కప్పుల చింత చిగురు లేదా ఒక కప్పు తీసుకున్నా చాలు, 100 గ్రాముల ఎండు మిర్చి, పచ్చి మిర్చి అర టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ టేస్ట్ సాల్ట్, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్, అర టీ స్పూన్ ఆవాలు, 6 వెల్లుల్లి రెబ్బలు, పచ్చడికి సరిపోను నూనె , రుచికి సరిపడా ఉప్పు, నాలుగు కరివేపాకు ఆకులను తీసుకోవాలి.

చింత చిగురును ఇలా కడిగి పెట్టుకోవాలి : ముందుగా చింత చిగురును తీసుకుని బాగా కడిగి శుభ్రం చేయనుకోవాలి. ఇంకా వీటిని బాగా కడిగి ఆరబెట్టాలి. ఈ పాన్ లో ఆయిల్ వేసి 10 ఎండుమిర్చి, అర టేబుల్ స్పూన్ ఆవాలు , అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి దీనిలో వేయించాలి. ఇంకా అదే పాన్ లో చింత చిగురు కూడా దీనిలో వేసి పచ్చి వాసన పోయే వరకు దీనిని వేయించాలి.

ఇక ఇప్పుడు ఈ మిక్సీలో 100 గ్రాముల పచ్చిమిర్చి, నాలుగు ఎండుమిర్చి, ఇంకా రుచికి తగినంత ఉప్పు, 10 వెల్లుల్లి వేసి, ఆ తర్వాత దీనిలో వేయించిన చింత చిగురు, ఇంకా నీళ్ళు కూడా కొద్దిగా వేసి పచ్చడిలాగా చేసుకోవాలి. ఇంకా చివర్లో కొద్దిగా ఆవాలు, 10 కరివేపాకు ఆకులు , 4 ఎండుమిర్చి కూడా వేసి దీనిలో తాలింపు లాగా పెట్టుకోవాలి.

ఈ పచ్చడిని తీసుకుని వేడి వేడి అన్నంలో తీసుకుంటే టేస్ట్ అదిరిపోతోంది. ఇంకా దీనిలో కొద్దిగా నెయ్యి తీసుకుని బాగా వేడి వేసి దీనిలో తింటే ఏ చికెన్ మటన్ కూడా సరిపోవు ఆలాగే దీనిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇంకా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. రోట్లో కానీ లేదా మిక్సీలో కానీ రుబ్బుకుంటే సరిపోతోంది.