డబ్బులు ఎక్కువ ఉంటే బంగారం కొనుక్కోండి.. పిల్లల్ని మాత్రం ఈ గవర్నమెంట్ స్కూల్‌లో చేర్చండి

Edited By:

Updated on: May 05, 2026 | 2:09 PM

బాపట్ల జిల్లా ప్రైడ్.. మక్కెనవారిపాలెం జెడ్పీ హైస్కూల్.. చదలవాడ సాయిరామ్ ధీరజ్ ఏకంగా 586 మార్కులు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచాడు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 18 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించి మండలంలోనే రికార్డు సృష్టించారు. 100కు 100 మార్కులు సాధించిన విద్యార్థులతో ఈ బడి ఇప్పుడు సరస్వతీ నిలయంగా మారింది.

1 / 5
ప్రభుత్వ పాఠశాల అంటేనే చులకనగా చూసే రోజులివి. కానీ, అదే ప్రభుత్వ బడి... ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు సవాల్ విసిరితే ఎలా ఉంటుంది..? బాపట్లజిల్లాలోని ఓ ప్రభుత్వ బడిలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో రికార్డులు తిరగరాశారు. బాపట్ల జిల్లాలోనే టాప్ మార్కులతో జయకేతనం ఎగురవేశారు. ఈ విజయోత్సాహాన్ని హెడ్ మాస్టర్ కాశీం సాహెబ్ వినూత్న రీతిలో సెలబ్రేట్ చేస్తున్నారు. గల్లీ గల్లీ తిరుగుతూ.. మైకు పట్టుకొని ప్రభుత్వ బడి గొప్పతనాన్ని చాటి చెబుతున్నారు.

2 / 5

బాపట్ల జిల్లా ప్రైడ్.. మక్కెనవారిపాలెం జెడ్పీ హైస్కూల్.. చదలవాడ సాయిరామ్ ధీరజ్ ఏకంగా 586 మార్కులు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచాడు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 18 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించి మండలంలోనే రికార్డు సృష్టించారు. 100కు 100 మార్కులు సాధించిన విద్యార్థులతో ఈ బడి ఇప్పుడు సరస్వతీ నిలయంగా మారింది.

బాపట్ల జిల్లా ప్రైడ్.. మక్కెనవారిపాలెం జెడ్పీ హైస్కూల్.. చదలవాడ సాయిరామ్ ధీరజ్ ఏకంగా 586 మార్కులు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచాడు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 18 మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించి మండలంలోనే రికార్డు సృష్టించారు. 100కు 100 మార్కులు సాధించిన విద్యార్థులతో ఈ బడి ఇప్పుడు సరస్వతీ నిలయంగా మారింది.

3 / 5
ఈ ఘనవిజయాన్ని ఊరందరికీ తెలియజేయాలని నిర్ణయించుకున్నారు హెడ్ మాస్టర్ కాశీం సాహెబ్.ట్రాక్టర్ పై విద్యార్థులను ఎక్కించి, డప్పు చప్పుళ్లతో ఊరేగింపు నిర్వహించారు. బైక్ పై మైక్ పట్టుకొని ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.. ఒక్క రూపాయి ఫీజు లేకుండా మీ బిడ్డలను మా బడికి పంపండి అంటూ టాం టాం వేస్తున్నారు హెడ్‌మాస్టర్‌ ఖాశిం 586 మార్కులు.. బాపట్ల జిల్లాలో 25 మండలాల్లో మనదే ఫస్ట్ ప్లేస్. 18 మందికి 500 పైన మార్కులు వచ్చాయి.

4 / 5

తెలుగులో 100 కు 100, లెక్కల్లో 100 కు 100.. ఇలా ప్రతి సబ్జెక్టులోనూ మన పిల్లలు మెరిశారు. ఇంత మంచి ఫలితాలు వస్తుంటే.. ప్రైవేట్ స్కూళ్లకి వెళ్లి ఎందుకు డబ్బులు దండగ చేసుకుంటారు..?మా దగ్గర ఉచిత పుస్తకాలు, బట్టలు, నోట్స్ అన్నీ ఇస్తాం. సన్నబియ్యంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం పెడతాం.

5 / 5
ఎంఏ బిఈడీ చేసిన నిష్ణాతులైన 16 మంది ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. ఏ లోపం ఉన్నా హెడ్ మాస్టర్ గా నన్ను అడగండి.. ఐదు ఏళ్లు ఇక్కడే ఉంటా. ప్రైవేట్ స్కూలు బస్సులను మన గ్రామంలోకి రానివ్వకండి.. మన బడిని కాపాడుకుందాం..!కలెక్టర్ చేతుల మీదుగా సత్కారం పొందిన తమ విద్యార్థుల ప్రతిభను చూసి గ్రామం మొత్తం గర్విస్తోంది. ప్రైవేట్ పాఠశాలల మాయలో పడకుండా, ప్రభుత్వ బడిలో చేర్పించాలని హెడ్ మాస్టర్ చేస్తున్న ఈ వినూత్న ప్రచారం ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తోంది.

Follow Us