
మగువలు అమితంగా ఇష్టపడేది బంగారం. ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే వారు ఒంటినిండా బంగారం ధరించడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా పెళ్లీల సమయంలో చాలా మంది బంగారం కొనడానికే ఎక్కు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఈ రోజుల్లో బంగారం కొనడం సామాన్యులకు భారంగా మారుతుంది. ఎందుకంటే రోజు రోజుకు బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే తులం బంగారం ధర లక్షమార్క్ దాటిన విషయం తెలిసిందే. కాగా, సోమవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.

నేడు ఆగస్టు 25 సోమవారం రోజున 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01,610 గా ఉంది. అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 93,140 గా ఉంది.

ఆగస్టు 24 ఆదివారం రోజున 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,01620 ఉండగా, నేడు ఆగస్టు 25 సోమవారం రోజున రూ.10 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.1,01,610గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఆదివారం రూ.93,150 ఉండగా, నేడు (సోమవారం) రూ.10 తగ్గడంతో 93,140గా ఉంది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,140 వద్ద ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,140వద్ద ఉంది

మరో వైపు నేడు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కేజీ వెండిపై రూ.100 తగ్గడంతో, మార్కెట్‌లో ఆగస్టు 25 సోమవారం రోజున కేజీ వెండి ధర రూ.1,29,900 ఉంది.