
కొనుగోలు దారులకు బంగారం, వెండి ధరలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. రోజురోజుకూ ఈ రెండు లోహాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బుధవారం ఏకంగా కొన్ని గంటల్లోనే బంగారంపై రూ.5000 వేలు పెరిగింది. దీంతో బంగారం ఆల్‌టైం రికార్డ్ ధరకు చేరుకుంది. కాబట్టి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సహా దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బుధవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఉదయం 6 గంటల నుంచి కేవలం 10 గంటల మధ్యలో బంగారం ధరల్లో భారీ మార్పులు వచ్చాయి. హైదరాబాద్‌లో ఉదయం 6 గంటలకు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,790గా ఉండగా దీనిపై రూ. 5000లకుపై పెరిగి ప్రస్తుతం 1,54,800 చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.4,600 పెరిగి ప్రస్తుతం 1,41,900 వద్ద స్థిరపడింది

ఇక విజయవాడ, విశాఖ పట్నంలో సైతం ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 1,54,800 కొనసాగుతుండగా ఉదయం ఈ ధర రూ.1,49,790గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 1,41,900గా ఉండగా ఈ ధర ఉదయం రూ. .1,37,310గా ఉంది.

ఇక దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూసూసుకుంటే.. కేరళ, కోల్‌కతా, బెంగళూరు, పూణె, ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,54,800 ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ. 1,41,900 వద్ద స్థిరపడింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం రూ.1,54,950గా ఉండగా చెన్నైలో తులం బంగారం ధర రూ.1,55,450 వద్ద స్థిరపడింది.

ఇక వెండి విషయానికి వస్తే ఇది.. బంగారం కంటే వేగంగా పరుగులు పెడుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో కేజీ వెండి ధర హైల్ టైం రికార్డ్ స్థాయి చేరి రూ.3,25,000 వద్ద స్థరపడింది. కేవలం 4 గంటల్లోనే కేజీ వెండిపై రూ.5000 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర చూసుకుంటే రూ.3,40,000గా ఉండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ఈ ధర రూ.3,25,000 వద్ద కొనసాగుతుంది.