
ఓట్ మీల్, మిల్క్ ఫేస్ ప్యాక్: ఓట్ మీల్‌ను పౌడర్ గా రుబ్బి, పాలతో కలిపి పేస్ట్‌లా చేసి, ముఖం, మెడపై సున్నితంగా మసాజ్ చేయండి. కడిగే ముందు 15-20 నిమిషాలు అలాగే ఉంచండి. ఈ మిశ్రమం చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. పోషణను అందిస్తుంది. దీంతో చర్మం అందంగా, కాంతివంతంగా మారుతుంది.

బొప్పాయి, తేనె ఫేస్ ప్యాక్: పండిన బొప్పాయిని గుజ్జులా చేసి, తేనెతో కలిపి, ముఖానికి 15-20 నిమిషాలు అప్లై చేయండి. ఈ ప్యాక్ బొప్పాయి ఎంజైమ్‌లను ఉపయోగించి కణాల పెరుగుదలను, తేనె తేమ లక్షణాలను పెంచుతుంది. దీంతో మీ చర్మం ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా ఉంటుంది.

కలబంద, దోసకాయ ఫేస్ ప్యాక్: కలబంద జెల్, దోసకాయను కలిపి ముఖానికి 20-30 నిమిషాలు అప్లై చేయండి. ఈ ప్యాక్ ఉపశమనం కలిగించే, హైడ్రేటింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. దీనివల్ల జిడ్డు చర్మం దూరం అవుతుంది. మీ చర్మం కోమలంగా చూడగానే ఆకట్టుకొనేలా మారుతుంది.

శనగపిండి, పసుపు, పెరుగు ఫేస్ ప్యాక్: శనగపిండి, పసుపు పొడి, పెరుగు కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోండి. ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయండి. ఈ ప్యాక్ టాన్ తొలగించడానికి, ముడతలను నియంత్రించడానికి, చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి సహాయపడుతుంది. దీంతో యవ్వనంగా కనిపిస్తారు.

పెరుగు, అరటిపండు ఫేస్ ప్యాక్: అరటిపండును మెత్తగా చేసి, పెరుగుతో కలిపి, ముఖానికి అప్లై చేయండి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ప్యాక్ తేమ, ఎక్స్‌ఫోలియేషన్‌ను అందిస్తుంది. ఇలా చేస్తే చర్మం ఆకర్షణీయంగా మారుతుంది.