
దాల్చిన చెక్క: వంటకాలకు రుచిని పెంచే దాల్చిన చెక్కతో చర్మ సమస్యలను కూడా అధిగమించవచ్చు. ఇందుకోసం దాల్చిన చెక్క పొడిని తీసుకుని దానికి కొద్దిగా తేనె కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను నుదుటిపై ఉండే మొటిమల మీద అప్లై చేయండి. ఇలా కొన్ని రోజుల పాటు కంటిన్యూగా చేస్తే కొద్ది రోజుల్లో మొటిమలు తగ్గిపోతాయి.

చర్మానికి మేలు చేస్తుంది: కలబంద రసం చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది, స్థితిస్థాపకతను పెంచుతుంది. ముడతలను తగ్గిస్తుంది. దీని శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మొటిమలతో పోరాడటానికి, చర్మపు మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

గ్రీన్ టీ టోనర్: చర్మం ఆరోగ్యంగా, తాజాగా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు టోనర్ అప్లై చేయడం ఉత్తమం. మీరు ఇంట్లో గ్రీన్ టీ నుంచి సహజసిద్ధంగా టోనర్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం గ్రీన్ టీ పొడిని తీసుకుని అందులో కొంచెం రోజ్ వాటర్ మిక్స్ చేసి స్ప్రే బాటిల్ లో భద్రపరుచుకోవాలి. దీనిని క్రమం తప్పకుండావాడితే మంచి ఫలితముంటుంది.

Rose Water

అలా చేయవద్దు: నుదిటిపై మొటిమలను స్క్రబ్ చేయడం లేదా రుద్దడం అసలు చేయవద్దు. ఇలా చేయడం వల్ల మొటిమలు మరింత ఎక్కువవుతాయి. పైన సూచించిన సహజ పద్ధతులను పాటించండి. మొటిమలను తగ్గించుకోండి.