
తేనె, కలబంద ఫేస్ ప్యాక్: తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి, కలబంద చర్మానికి మేలు చేస్తుంది. వీటిని కలిపి పేస్ట్ లా చేసుకుని ముఖానికి పట్టించి, 15-20 నిమిషాల తర్వాత కడిగేసుకోవచ్చు. ఇలా చేస్తే మీ ఫేస్ మెరిసిపోతుంది.

ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్: ముల్తానీ మిట్టి చర్మంపై ఉన్న అదనపు నూనెను, మురికిని తొలగించి చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. దీనిని రోజ్ వాటర్ లేదా నీటితో కలిపి చర్మానికి పట్టించవచ్చు. ఇది ముఖంపై అప్లై చేస్తే మొటిమలు దూరం అవుతాయి. అలాగే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది.

శెనగపిండి, పసుపు ఫేస్ ప్యాక్: శెనగపిండి చర్మాన్ని శుభ్రపరుస్తుంది, పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. వీటిని కొద్దిగా పాలు లేదా పెరుగుతో కలిపి రాసుకుంటే మొటిమల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది తరుచు ముఖానికి పూస్తే మంచి ఫలితం ఉంటుంది.

నిమ్మరసం, తేనె ఫేస్ ప్యాక్: నిమ్మరసంలోని విటమిన్ సి మొటిమలను పొడిగా చేస్తుంది, తేనె చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. వీటిని కలిపి మొటిమలున్న చోట అప్లై చేసి, ఆరిన తర్వాత కడిగేయాలి. ఇది మొఖంపై ఉన్న మొటిమలను మాయం చేయడంలో సహాయపడతాయి.

శుద్ధి చేసిన ధాన్యాలు, అధిక చక్కెర ఉన్న ఆహారాలు మొటిమలను పెంచుతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ముఖాన్ని రోజూ శుభ్రం చేసుకోవాలి. మేకప్ వేసుకున్నట్లయితే పడుకునే ముందు తప్పనిసరిగా తొలగించాలి. మీ ఫోన్ కవర్‌పై ఉండే బాక్టీరియా మొటిమలను పెంచవచ్చు. కాబట్టి దాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.