నిజమైన నెయ్యిని గుర్తించడానికి అందులో నాలుగు లేదా ఐదు చుక్కల అయోడిన్ వేయాలి. నీలం రంగులోకి మారితే నకిలీ నెయ్యి అని అర్థం. బంగాళాదుంప పిండి వంటి కార్బోహైడ్రేట్లను నెయ్యిలో కలపి కల్తీ చేస్తారు. ఈ పరీక్ష చేయడం ద్వారా అది కల్తీనా? ఒరిజినలా? అనేది తేలుతుంది.
చేతులకు కాస్త నెయ్యి రాసి రెండు చేతులతో బాగా రుద్దాలి. కొంత సమయం తరువాత నెయ్యి వాసన పోతుంది. నాణ్యమైన నెయ్యి ఎప్పుడూ సువాసనగా ఉంటుంది. ఇలా రుద్దిన వెంటనే వాసన పోకూడదు. ఒకవేళ వాసన పోతే అది కల్తీ నెయ్యి అని గుర్తించాలి.
కల్తీ నెయ్యిని గుర్తించడానికి కొద్దిగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపాలి. అది ఎరుపు రంగులోకి మారితే కల్తీ చేయబడిందని అర్థం.
కల్తీ నెయ్యిని గుర్తించడానికి కొద్దిగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపాలి. అది ఎరుపు రంగులోకి మారితే కల్తీ చేయబడిందని అర్థం.