- Telugu News Sports News Cricket news ipl 2023 Lucknow Super Giants player quinton de kock poor form before ipl 2023 south africa vs west indies
IPL 2023: 4 ఇన్నింగ్స్‌లు.. 14 పరుగులు.. 2 సార్లు డకౌట్.. ఐపీఎల్ 2023కి ముందే టెన్షన్ పెంచిన స్టార్ ప్లేయర్.. ఎవరంటే?
Lucknow Super Giants: ఐపీఎల్ 2023 మార్చి 31 నుంచి అహ్మదాబాద్‌లో ప్రారంభం కానుంది. మరోసారి లీగ్‌లో అద్భుతమైన మ్యాచ్‌లతో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. టోర్నమెంట్‌కు ముందు తమ ఆటగాళ్లు బలమైన ఫామ్‌లో ఉండాలని ప్రతి జట్టు ఆశిస్తుంది. అయితే లక్నో సూపర్ జెయింట్‌లో మాత్రం టెన్షన్ పెరిగింది.
Updated on: Mar 26, 2023 | 5:25 AM

లక్నో సూపర్ జెయింట్స్ - Gazab Andaaz

గత సీజన్‌లో LSG కోసం అత్యధికంగా పరుగులు చేసిన అనుభవజ్ఞుడైన దక్షిణాఫ్రికా వికెట్-కీపర్ కం బ్యాట్స్‌మన్.. ఈ సీజన్‌లోనూ భారీ ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంటుంది. కానీ, తాజా ఫాంతో లక్నో ఫ్యాన్స్ నిరాశకు గురికావచ్చని తెలుస్తోంది.

వెటరన్ సౌతాఫ్రికా ఓపెనర్ ఇటీవలి టీ20 ఫామ్ బాగా లేదు. మార్చి 25 శనివారం వెస్టిండీస్‌తో జరిగిన మొదటి వన్డేలో డికాక్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే స్పిన్నర్ అకిల్ హొస్సేన్ చేతికి చిక్కాడు.

ఇలా వికెట్ కోల్పోవడం ఇదే మొదటిసారి కాదు. అయితే అంతర్జాతీయ టీ20లో వరుసగా నాలుగో ఇన్నింగ్స్‌లో ఘెరంగా విఫలమయ్యాడు. ఈ 4 ఇన్నింగ్స్‌ల్లో అతని స్కోర్లు 0, 13, 1, 0గా నిలిచింది.

డికాక్ గత సీజన్‌లో 15 మ్యాచ్‌లలో 508 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో మూడవ స్థానంలో నిలిచాడు. అయితే అతను లక్నో తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సీజన్‌లో ఓ ఇన్నింగ్స్‌లో 140 పరుగులతో భారీ స్కోర్ నమోదు చేశాడు.





























