- Telugu News Photo Gallery Get instant glow skin try to Honey face mask, check here is details in Telugu
Honey Face Mask: ఇంట్లోనే ఈ గోల్డ్ ఫేషియల్ చేసుకోండి.. ముఖం వెలిగిపోతుంది!
అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందులోనూ ఈ రోజుల్లో అందానికి ఉన్న ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదు. మగవారైనా, ఆడవారైనా ఎక్కువగా అందానికి వాల్యూ ఇస్తున్నారు. అందంగా ఉండటం తప్పేం కాదు. అయితే దానికి అనవసరంగా డబ్బు వృథా చేయకూడదు. అందాన్ని పెంచుకోవాలంటే చాలా రకాల మార్గాలు ఉన్నాయి. అందంగా కనిపించాలని చాలా మంది ఫేషియల్స్, ఫేస్ వాష్ క్రీములు, లోషన్లు, సబ్బులు ఇలా రక రకాల ప్రోడెక్ట్స్..
Updated on: Jan 18, 2024 | 1:30 PM

అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందులోనూ ఈ రోజుల్లో అందానికి ఉన్న ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదు. మగవారైనా, ఆడవారైనా ఎక్కువగా అందానికి వాల్యూ ఇస్తున్నారు. అందంగా ఉండటం తప్పేం కాదు. అయితే దానికి అనవసరంగా డబ్బు వృథా చేయకూడదు. అందాన్ని పెంచుకోవాలంటే చాలా రకాల మార్గాలు ఉన్నాయి.

అందంగా కనిపించాలని చాలా మంది ఫేషియల్స్, ఫేస్ వాష్ క్రీములు, లోషన్లు, సబ్బులు ఇలా రక రకాల ప్రోడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటితో కొద్ది మందికి మాత్రమే రిజల్ట్ వస్తుంది. అన్ని రకాల ప్రోడెక్ట్స్ అందరికీ పడవు.

కానీ మీ ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల, ఎక్సర్ సైజులు, యోగా వంటివి చేయడం వల్ల మీ శరీరంలో మార్పులు గమనించవచ్చు. అదే విధంగా కాస్త సమయం వ్యచ్చించి ఇంట్లోనే నేచురల్‌గా కొన్ని టిప్స్ పాటిస్తే.. మంచి ఫలితాలు ఉండటమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

తేనె అందరి ఇంట్లోనూ ఉంటుంది. తేనెను ముఖానికి రాసుకుని మర్దనా చేసుకోవడం వల్ల చర్మం అనేది కాంతి వంతంగా తయారవుతుందని నిపుణులు సైతం చెబుతున్నారు. అయితే తేనె చర్మానికి రాసుకోవడం వల్ల స్కిన్‌పై ఉండే వెంట్రుకలు తెల్లబడతాయని అనుకుంటూ ఉంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే.

ముఖం శుభ్రంగా క్లీన్ చేసుకుని.. తేనె రాసుకుని ఓ అరగంట పాటు అలానే ఉంచితే ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తేనెలో ఉండే పోషకాలు ఇన్ స్టెంట్‌గా చర్మానికి అందుతాయి. దీంతో చర్మంపై ఉండే మచ్చలు అన్నీ పోయి.. అందంగా కనిపిస్తారు. అయితే స్వచ్ఛమైన తేనె వాడితేనే మీకు మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి.




