వెల్లుల్లిలో అలసిన్ అనే కాంపౌండ్ తో పాటు రక్తాన్ని పలుచుగా చేసే యాంటీ డ్రాబోటిక్ వాసో డైలేటరీ అంటే రక్తనాళాలను సడలించే గుణాలతో కూడిన సహజ సంమేళనం వెల్లుల్లి. వెల్లుల్లి రక్త ప్రసరణని మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వెల్లుల్లి హెల్దీనే అయినప్పటికీ ఇది ఎంతవరకు పనిచేయాలో అంతవరకే పనిచేస్తుంది.

ఇందులోని ఔషధ గుణాలు రక్తంలోని ట్రై గ్లిజరైడ్స్ ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వెల్లుల్లిలోని రసాయనాలు ఐరన్ విడుదలను ఎక్కువగా ప్రేరేపిస్తాయి. దీంతో అనీమియా సమస్యకు చెక్ పెట్టవచ్చు. వెల్లుల్లి తీసుకునే వారితో పోలిస్తే తీసుకోని వారిలో జలుబు, ఉబ్బరపు తిత్తులకు సంబంధించిన సమస్యలు తక్కువ. వేసవిలో వీటిని తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది.

వీటికి శరీరంలో అధిక వేడిని పెంచే గుణం ఎక్కువగా ఉండటం వల్ల అందులోనూ వాతావరణం వేడిగా ఉండటం వల్ల మన శరీరంలో వేడి పెరిగే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వేసవిలో వెల్లుల్లి తక్కువగా తీసుకోవడం ఉత్తమం.

నోటి పూత, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారు వేసవిలో పచ్చి వెల్లుల్లి తినకూడదు. జీర్ణ సమస్యలు తగ్గేందుకు వేసవిలో వెల్లుల్లిని మితంగా తీసుకోవచ్చు. పచ్చిగా తినే బదులు ఉడికించి లేదా వేయించి ఉరగాయలతో కలిపి తినవచ్చు. కానీ రోజుకు రెండు వెల్లుల్లి రెబ్బలకంటే ఎక్కువ తినకూడదు.