
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, నక్షత్రాలను మార్చుకోవడం వలన కొన్ని రకాల రాజయోగాలు ఏర్పడుతుంటాయి. దీని ప్రభావం 12 రాశుల పై పడుతుంటుంది. ఈ రాజయోగాల్లో గజకేసరి రాజయోగం ఒకటి. ఇది చాలా అరుదుగా ఏర్పడుతుంది అంటుంటారు జ్యోతి ష్య శాస్త్ర పండితులు. అయితే ఈ సారి మే5న గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది.

సింహ రాశి : గజకేసరి రాజయోగం సింహ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. విద్యార్థులకు, కలిసి వస్తుంది. చేతినిండా డబ్బుతో చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

మకర రాశి : గజకేసరి రాజయోగం వలన రియలెస్టేట్ వ్యాపారస్తులు అత్యధిక లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో మంచి గౌరవం కీర్తి లభిస్తాయి. పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి అవి మీకు భవిష్య్తత్తులో ఉపయోగపడుతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్నింటా కలిసి వస్తుంది.

తుల రాశి : గజకేసరి రాజయోగం వలన ఈ రాశి విద్యార్థులు మంచి ర్యాంకులు పొంది సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. అదే విధంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయంట. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఖర్చులు తగ్గుతాయి. ఎలాంటి ఆందోళనలు లేకుండా జీవితం సాగిపోతుంది. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది

కుంభ రాశి :గజ కేసరి రాజయోగం వలన కుంభ రాశి వారికి ఏ పని చేసినా అందులో విజయం కలిసి వస్తుందంటున్నారు పండితులు. ఆదాయం పెరుగుతుంది. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయడం లేదా, కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెళ్లి, ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న చికాకులు తొలిగిపోతాయి. ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.