
కాళ్ళను శుభ్రపరచడం: ప్రత్యేకించి వర్షంలో తడిసిన తర్వాత ప్రతిరోజూ తేలికపాటి సబ్బు, గోరువెచ్చని నీటితో మీ కాళ్ళను కడగాలి. ఇలా చేయడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ లేదా ఇతర సమస్యలు రాకుండా మీ కాళ్ళను కాపాడవచ్చు.

కాళ్ళను ఆరబెట్టడం: మీ కాళ్ళు, పాదాలను, ముఖ్యంగా కాలి వేళ్ల మధ్య, మృదువైన టవల్ ఉపయోగించి పూర్తిగా ఆరబెట్టండి. ఇలా చేస్తే కళ్ళలో నీరు నిలిచిపోకుండా ఉంటుంది. దీంతో ఫంగల్ ఇన్ఫెక్షన్ ముందుగానే అరికట్టవచ్చు.

మాయిశ్చరైజింగ్: మీ చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి తేలికైన, జిడ్డు లేని మాయిశ్చరైజర్ రాయండి. ముఖ్యంగా మీకు చెమట పట్టే పాదాలు ఉంటే, అదనపు తేమను పీల్చుకోవడానికి యాంటీ ఫంగల్ పౌడర్ వాడండి.

గోళ్ల సంరక్షణ: మీ కాలి గోళ్ల కింద మురికి, చెత్త పేరుకుపోకుండా ఉండటానికి వాటిని క్రమం తప్పకుండా కత్తిరించండి. ఇలా చెయ్యకపోతే గోళ్లలో మురికి పేరుకుపోయి కాళ్ళలో ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్యలు కారణం అవుతుంది.

చెప్పులు లేకుండా నడవకండి: తడి ప్రాంతాలలో చెప్పులు లేకుండా నడవకండి, ఎందుకంటే ఇది మీ పాదాలకు శిలీంధ్రాలు, బ్యాక్టీరియా పేరుకుపోతుంది. ఏవైనా కోతలు లేదా గీతలు ఉంటే వెంటనే యాంటీసెప్టిక్, బ్యాండేజ్‌తో సరిచేయండి.