Instagram: మీ ఫ్రెండ్స్ ఎక్కడున్నా ఈజీగా తెలుసుకోవచ్చు.. ఇన్‌స్టాలో కొత్తగా 5 అద్భుత ఫీచర్లు

Updated on: Aug 23, 2025 | 4:33 PM

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీఒక్కరికి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తప్పక ఉంటుంది. చిన్న నుంచి పెద్ద దాకా ప్రతి ఒక్కరు ఇన్‌స్టా రీల్స్‌ను పిచ్చిగా చూస్తారు. ఇక యూజర్లకు ఎప్పటికప్పుడు మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు మెటా కొత్త కొత్త అప్డేట్స్ తీసుకొస్తుంటుంది. ఈసారి ఇన్‌స్టాగ్రామ్ ఒకేసారి 5 అద్భుతమైన అప్‌డేట్‌లను అందించింది. ఈ అప్‌డేట్‌లు మీ ఇన్‌స్టాగ్రామ్ వాడకాన్ని పూర్తిగా మార్చనున్నాయి.

1 / 5
రీల్స్ రీపోస్ట్: మీకు బాగా నచ్చిన రీల్స్‌ను ఇప్పుడు మీరు మీ స్నేహితులు, ఫాలోవర్లతో పంచుకోవచ్చు. ఈ ఫీచర్ గతంలో ట్విట్టలోని రీట్వీట్ ఫీచర్‌ లాగా పనిచేస్తుంది. మీరు రీపోస్ట్ చేసిన రీల్స్ మీ ప్రొఫైల్‌లో కూడా కనిపిస్తాయి.

2 / 5
ఫ్రెండ్స్ మోడ్: ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా ఫ్రెండ్స్ మోడ్‌ను ప్రారంభించింది. ఈ మోడ్‌ను ఆన్ చేయడం ద్వారా, మీరు మీ స్నేహితుల పోస్ట్‌లు, స్టోరీస్, రీల్స్‌ను మాత్రమే చూడగలరు. మీరు పబ్లిక్ కంటెంట్ నుండి విరామం తీసుకొని కేవలం స్నేహితుల అప్‌డేట్‌లను చూడాలనుకుంటే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

3 / 5
ఫ్రెండ్స్ లొకేషన్: ఇప్పుడు మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మీ స్నేహితులు ఎక్కడున్నారో సులభంగా తెలుసుకోవచ్చు.ఈ ఫీచర్ గూగుల్ మ్యాప్స్ లాగా పనిచేస్తుంది. దీని ద్వారా మీ స్నేహితుడు ఎక్కడ ఉన్నాడో, వారు ఎక్కడ తిరుగుతున్నారో చూడవచ్చు.

4 / 5
మ్యూజిక్ డిస్క్: సంగీతాన్ని వినడానికి ఇన్‌స్టాగ్రామ్ ఒక కొత్త మార్గాన్ని పరిచయం చేసింది. మ్యూజిక్ డిస్క్ ఫీచర్‌లో, డిస్క్ శైలిలో పాటలను ప్లే చేయడానికి మీకు ఒక సరదా ఆప్షన్ లభిస్తుంది. ఇది డీజే డిస్క్ లాగా కనిపిస్తుంది. ఇది సంగీతం వినే అనుభవాన్ని మరింత ఆసక్తికరంగా చేస్తుంది. ఈ డిస్క్ శైలి సంగీతాన్ని మీరు మీ స్టోరీస్ లేదా రీల్స్‌కు కూడా జోడించవచ్చు.

5 / 5
20 నిమిషాల రీల్స్: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ నిడివిని కూడా పెంచింది. ఇప్పుడు మీరు 20 నిమిషాల నిడివి గల రీల్స్‌ను అప్‌లోడ్ చేయవచ్చు. దీని ద్వారా కంటెంట్ క్రియేటర్లు మరింత డీటైల్డ్‌గా వీడియోలను రూపొందించగలరు. ఈ కొత్త అప్‌డేట్‌లు ఇన్‌స్టాగ్రామ్‌ను మరింత ఆసక్తికరంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చనున్నాయి.