
పాలిష్ చేసిన బియ్యం వల్ల కలిగే నష్టాలకు ప్రత్యామ్నాయంగా కొర్రలు (మిల్లెట్స్) తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇంకా ఆకలి నియంత్రించబడుతుంది, మలబద్ధకం తగ్గుతుంది, పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. అయితే, బరువు తగ్గాలనుకునేవారు లేదా షుగర్ ఉన్నవారు కొర్రలను మితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

పాలిష్ చేసిన బియ్యం వినియోగం ఆధునిక జీవనశైలిలో అనేక ఆరోగ్య సమస్యలకు తెచ్చి పెడుతుందని అంటున్నారు. బియ్యంలోని పోషకాలు పాలిషింగ్ ప్రక్రియలో తొలగిపోవడమే కాకుండా, ఇది త్వరగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్‌గా మారి, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే, బియ్యానికి ప్రత్యామ్నాయంగా మిల్లెట్స్, ముఖ్యంగా కొర్రలు మంచి ఎంపిక

కొర్రల అన్నం తక్కువ ధరలో లభించడం, సులభంగా వండుకోవడం, రుచికరంగా ఉండటం, పొడి పొడిగా రావడం వల్ల సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటుంది కొర్రలు కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా, శరీరానికి మూడు ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని వివరించారు:

100 గ్రాముల కొర్రల్లో సుమారు 9 గ్రాముల ఫైబర్ ఉంటుంది. బియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్‌ల వలె కాకుండా, కొర్రల్లో కార్బోహైడ్రేట్‌లు అధిక ఫైబర్ ఉంటాయి. ఈ రెండూ కొర్రలు నెమ్మదిగా జీర్ణం కావడానికి సహాయపడతాయి. ఉదయం కొర్రల అన్నం తిన్న తర్వాత, ఆకలి సాయంత్రం వరకు అనిపించదు, నీరసం రాదు. ఇది తరచుగా తినాలనే కోరికను తగ్గిస్తుంది, తద్వారా ఆహార నియంత్రణకు దోహదపడుతుంది.

మెరుగైన ప్రేగు కదలికలు : కొర్రల్లోని అధిక ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరం. ఫైబర్ మలాన్ని మృదువుగా చేసి, సుఖ విరోచనానికి సహాయపడుతుంది ఇంకా ప్రేగు కదలికలు కూడా మెరుగుపరుస్తాయి. పేగుల్లో రోగనిరోధక వ్యవస్థ అంత బలంగా ఉంటుంది. కొర్రల్లోని ఫైబర్ ఈ మంచి బ్యాక్టీరియాల వృద్ధికి బాగా ఉపయోగపడుతుందని, ఇది ప్రేగులకు ప్రోబయోటిక్‌లా పనిచేస్తుందని పరిశోధనల్లో కూడా తేలింది.