
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం, కలయికల వల్ల పలు శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలు ఆయా రాశులపై అనుకూల, ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. ఈ ఏడాది 2026, మార్చి 18న ఒక అరుదైన గ్రహ సంయోగం జరగనుంది. విలాసం, సౌకర్యానికి ప్రభావం చూపే శుక్రుడు, జ్ఞానానికి ప్రతీక బృహస్పతి (గురువు)తో ఒక ప్రత్యేక “కేంద్ర దృష్టి యోగం”లో కలుస్తాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం, ఈ యోగం జీవితంలో అప్రతిహత పురోగతి, ఆనందం, స్థిరత్వాన్ని తీసుకురుస్తుంది. ముఖ్యంగా 1, 4, 7, 10 స్థానాల్లో ఉన్న గ్రహాలకు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ యోగంతో లాభం పొందే రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి.. మేష రాశి వారికి ఈ యోగంతో కెరీర్‌లో మంచి అవకాశాలు వస్తాయి. బృహస్పతి ఆశీర్వాదంతో ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. శుక్రుని ప్రభావంతో వ్యక్తిత్వం ఆకర్షణీయంగా మారుతుంది. ప్రమోషన్ లేదా మంచి ఉద్యోగ అవకాశాలు అందే అవకాశం ఉంటుంది.

మిథున రాశి.. మిథున రాశి వారి ఆర్థిక స్థితి మెరుగవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. విలాసవంతమైన సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుంది. పాత పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఆస్తి లేదా వాహన కొనుగోలు కోసం అనుకూలం. దీంతో వీరు కొత్త వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేస్తారు.

సింహ రాశి.. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తి అవుతాయి. పరిష్కరించలేని సమస్యలకు పరిష్కారం కనిపిస్తుంది. విదేశాల్లో చదువు, వీసా, ఆర్థిక ఏర్పాట్లు సజావుగా సాగుతాయి. మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఏ పనిచేసినా అనుకూల ఫలితాలు పొందుతారు.

తులా రాశి.. తులా రాశి వారి కుటుంబ సంబంధాలు బలపడతాయి. ప్రేమ వ్యవహారాలు విజయవంతం అవుతాయి. వివాహిత జంటల మధ్య అవగాహన, ప్రేమ పెరుగుతుంది. వ్యాపారం లేదా భాగస్వామ్య లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

ధనుస్సు రాశి.. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సానుకూల దృక్పథం వస్తుంది. వ్యాపార ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక అంశాల్లో ఆసక్తి పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు వివిధ వనరుల నుంచి సేకరించి అందించడం జరిగింది. దీన్ని విశ్వసించడం మీ వ్యక్తిగతం. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)