1 / 9
భారత విశిష్ట నేతల్లో మన్మోహన్ సింగ్ ఒకరు.. మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక విధానాలపై బలమైన, చెరగని ముద్ర వేశారు.. ఈ మాటలన్నది ప్రతిపక్ష యూపీఏ కూటమి నేతో లేదా కాంగ్రెస్ నేతో కాదు. భారతీయ జనతా పార్టీ నేత, భారత ప్రధాని నరేంద్రమోదీ. అదీ మన్మోహన్ సింగ్ లెవెల్. ఆర్థిక వేత్తగా, ప్రధానిగా మన్మోహన్‌సింగ్ దేశానికి చేసిన సేవలు అలాంటివి మరి. దివాలా తీసిన భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు మన్మోహన్ సింగ్. ఆర్థిక వ్యవస్థను సరళీకరించి భారతదేశం ప్రపంచంలోనే ఆర్థిక సూపర్ పవర్‌గా మారడానికి మార్గం సుగమం చేశారు.