
నెయ్యి: A2 రకం బీటా-కేసిన్ ప్రోటీన్‌ను ఉత్పత్తి చేసే ఆవుల పాలతో తయారు చేయబడిన స్వచ్ఛమైన నెయ్యి. కార్డియాలజిస్టుల ప్రకారం.. ఈ నెయ్యి శరీరానికి, ముఖ్యంగా మెదడు ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.

మూలికలు - సుగంధ ద్రవ్యాలు: మన వంటశాలలోని పసుపు, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలను హీరోలుగా డాక్టర్ చోప్రా అభివర్ణించారు. ఇవి యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. అధిక రక్త చక్కెర, ప్రసరణ లిపిడ్ల వల్ల కలిగే కణజాల నష్టం, వాపు నుండి రక్షించడానికి ఇవి తోడ్పడతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

డ్రై ఫ్రూట్స్: బాదం, వాల్‌నట్స్ వంటి ఎండిన పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కణాల మరమ్మత్తుకు సహాయపడటంతో పాటు అభిజ్ఞా సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.

చిక్కుళ్ళు - పప్పుధాన్యాలు: శాకాహారులకు ప్రోటీన్ లోపాన్ని అధిగమించడానికి ఇవి గొప్ప ఎంపిక. పప్పులు, చిక్కుళ్ళను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రోజంతా శక్తిని నిర్వహించడానికి, కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని కార్డియాలజిస్టులు తెలిపారు.

డాక్టర్ చోప్రా చెప్పినట్టుగా.. ఆరోగ్య ప్రయోజనాల కోసం సప్లిమెంట్లపై ఆధారపడకుండా, మన సాంప్రదాయ వంటకాలలోని ఈ అద్భుతమైన పదార్థాలను నిత్యం ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు