
తెలుగింటి కట్టుబొట్టుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రత్యేక ఆహార్యం తెలుగువారి సొంతం.. పంచె కట్టులో పురుషులు, చీర చుట్టులో మహిళలు తమ ప్రత్యేకతను చాటుకుంటారు. విదేశాల నుండి వచ్చిన మహిళలు కూడా తెలుగువారి సాంప్రదాయ వస్త్రధారణ పట్ల మక్కువ చూపుతుంటారు. తెనాలిలో అటువంటి సందర్భమే వచ్చింది.

తెనాలిలోని మారీసు పేటలో దయామణి జోసెఫ్ పాఠశాల ఉంది. పాఠశాల ప్రిన్పిపాల్ గా హేమలత కొనసాగుతున్నారు. హేమలత సోదరుడు సాగర్ అస్ట్రేలియాలోని నోట్రే డామ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. దీంతో ప్రతి ఏటా జోసెఫ్ పాఠశాల వార్షికోత్సవంలో పాల్గొనడానికి ఆయన ప్రత్యేకంగా ఇండియా వస్తుంటారు.

సాగర్ పనిచేసే విశ్వ విద్యాలయంలోని విద్యార్ధులు కూడా ఇండియా పట్ల మక్కువ చూపుతుంటారు. ఇక్కడి ఆచార్యవ్యవహరాలంటే వారికి ఎంతో ఇష్టం. దీంతో సాగర్ ఇండియా వచ్చేటప్పుడు అస్ట్రేలియా నుండి కొంతమంది విద్యార్ధులు తెనాలి వస్తారు. ఇలా వచ్చిన విదేశీ యువతి, యువకులు కొద్దీ రోజుల పాటు ఇక్కడే ఉంటారు. వార్పికోత్సవ సమయంలో తెలుగు వారి కట్టుబొట్టుతో ప్రత్యేకంగా రెడీ అవుతారు. తెనాలి చుట్టుపక్కల జరిగే సంక్రాంతి విశేషాలను తెలుసుకుంటారు.

పండుగ సమయంలో పల్లెటూళ్లకు వెళ్లి అక్కడ జీవన విధానాన్ని తెలుసుకుంటారు. ఇండియాలోని పల్లెటూళ్లు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయని విదేశీ యువతి యువకులు చెప్పారు. వార్షికోత్సవంలో సాంప్రదాయ వస్త్రాధారణతో చిన్నారులతో కలిసి మెలిసి ఆడి పాడతారు. కొద్దీ రోజుల తర్వాత తిరిగి తమ స్వదేశానికి వెళతారు.

విదేశీ మహిళలు తెలుగింటి చీర కట్టి మురిసి పోతే పురుషులు పంచె కట్టులో మెరిసి పోయారు. వీరిని స్థానికులు కూడా ప్రత్యేకంగా విదేశీయులపై ప్రసంశలు కురిపించారు