- Telugu News Photo Gallery For shiny and healthy hair make natural hair rines with these ways in Telugu
Hair Care Tips: జట్టు ఒత్తుగా.. అందంగా మెరిసేలా కనిపించాలంటే..? ఈ సింపుల్ టిప్స్ పాటించండి..
Healthy Hair Care: ప్రస్తుత కాలంలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో జుట్టు సంరక్షణ చాలా ముఖ్యం. షాంపూ తర్వాత కండీషనర్ ఉపయోగించడం చాలా ముఖ్యం. కండీషనర్‌తో పాటు మీరు హెయిర్ రిన్స్ (శుభ్రపరచడం) చేయడం ద్వారా జుట్టును ఆరోగ్యంగా మెరిసేలా చేయవచ్చు. ఈ హోం రెమెడీస్ తో నేచురల్ హెయిర్ రిన్స్ చేస్తే ఎంతో మేలని సౌందర్య నిపుణులు పేర్కొంటున్నారు.
Updated on: Apr 12, 2022 | 9:23 AM

బేకింగ్ సోడా: ఒక చెంచా బేకింగ్ సోడా దానిలో కొన్ని నీళ్లు వేసి పేస్ట్ లా తయారు చేయాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత మీ జుట్టుకు అప్లై చేసి.. కొన్ని నిమిషాలపాటు ఉంచాలి. ఆ తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. దీని తరువాత ఖచ్చితంగా జుట్టుకు కండీషనర్ వర్తించండి. దీంతో జుట్టు సమస్యలను అదుపులో ఉంచుకోవచ్చు.

బ్లాక్ టీ: జుట్టును శుభ్రం చేయడానికి బ్లాక్ టీ బ్యాగ్‌లను నీటిలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత తలస్నానం చేసేటప్పుడు ఈ టీ ఆకుల నీటిని జుట్టుకు పట్టించాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్: ఇది జుట్టు సంరక్షణలో ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. దీనితో తయారు చేసిన హెయిర్ రిన్స్ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కొంచెం నీటిలో రెండు చెంచాల యాపిల్ సైడర్ వెనిగర్ కలపండి. తలస్నానం చేసేటప్పుడు షాంపూ చేయడానికి ముందు ఇది జుట్టుకు అప్లై చేయండి.

అలోవెరా రిన్స్: జుట్టు సంరక్షణ విషయానికి వస్తే కలబంద ఔషదంలా పనిచేస్తుంది. కలబంద జెల్ వేసి నీటిని మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల జుట్టులో ఉండే చుండ్రు తొలగిపోతుంది.

నిమ్మరసం: చుండ్రు తొలగించడానికి నిమ్మకాయ రసం బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం ఒక కప్పులో నీరు తీసుకుని, దానికి రెండు చెంచాల నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించండి. ఆతర్వాత షాంపూతో శుభ్రం చేసుకోని.. కండీషనర్ చేసుకోవాలి.




