
కీడ్నిల్లో నొప్పి కారణంగా చాలా మంది రకరకాల మందులను వాడుతుంటారు. ముఖ్యంగా మీకు కిడ్నీ వ్యాధి ఉన్నట్లయితే నొప్పి నివారణ మందులు వైద్యుని సలహా మేరకు నడుచుకోవాల్సి ఉంటుంది.

ఉప్పు అధికంగా తీసుకోవడం కూడా కిడ్నీకి ప్రమాదకరమేనంటున్నారు వైద్య నిపుణులు. ఉప్పులో సోడియం ఎక్కువగా ఉండటం వల్ల మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. ఉప్పుకు బదులుగా మూలికలు, సుగంధ ద్రవ్యాలు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి మంచి ఆహారం మాత్రమే కాదు తగినంత నీరు తాగకపోతే కిడ్నీ స్టోన్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎక్కువ మొత్తంలో నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.

మాంసాహారం ఎక్కువగా తింటే రక్తంలో అధిక మొత్తంలో ఆమ్లాన్ని చేస్తుంది. ఇది మూత్రపిండాలకు హానికరం. అందుకే కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే మాంసాహారం ఎక్కువగా తీసుకోకుండా ఉండాలని అంటున్నారు వైద్యులు.

ధూమపానం: ధూమపానం తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు, గుండె మాత్రమే కాకుండా, మీ మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి. అధిక మొత్తంలో ధూమపానం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి.

మద్యం దుర్వినియోగం: మీరు రోజూ ఆల్కహాల్ తీసుకుంటే, మీ ఈ అలవాటును వదిలివేయండి. దీని వల్ల మీ కిడ్నీ పాడైపోవచ్చు.