2 / 5
ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలను ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటిని రోజు వారీ ఆహారంలో చేర్చుకుంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం.. ముఖ్యంగా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో అల్లం ప్రభావవంతంగా పనిచేస్తుంది. అల్లం శ్వాసకోశంలోని అన్ని విషపదార్ధాలను బయటకు పంపుతుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.