Eggs Boiling: గుడ్లను ఉడకబెట్టేటప్పుడు పగిలిపోకుండా ఉండాలంటే…తప్పక ఇలా చేయండి..!

Updated on: Jun 12, 2025 | 8:38 PM

సాధారణంగా చాలా సందర్భాలలో గుడ్లు ఉడకబెడుతున్నప్పుడు అవి పగిలిపోతుంటాయి..అలా పగిలినప్పుడు గుడ్డు వృధా అయిపోతుంది. సరిగ్గా ఉడకదు. అలా కాకుండా ఉండాలంటే.. గుడ్లని ఉడకబెట్టేటప్పుడు కొన్ని సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే సరిపోతుంది. ఇలా చేస్తే పెంకు సులువుగా రావడమే కాదు గుడ్లలో అవసరమైన పోషకాలు చెక్కుచెదరకుండా ఉంటాయి. దీనికి అద్భుతమైన రుచి ఉంటుంది. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
గుడ్లు ఉడకబెట్టేటప్పుడు వాటికి సరిపడా పెద్ద సైజు గిన్నెను తీసుకోవాలి. గిన్నెలో గుడ్లు మొత్తం మునిగేవిధంగా నీరు పోయాలి. ఇలా చేయడం వల్ల గుడ్లు ఒకదానికొకటి తగలకుండా ఉంటాయి. దాంతో పగలకుండా ఉంటాయి.

2 / 5
మీరు గుడ్లు ఉడకబెడుతున్న గిన్నెలోని నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు వేయాలి. ఇలా చేస్తే గుడ్లు పగలకుండా ఉంటాయి. ఇలా ఉప్పు నీటిలో గుడ్లను ఉడకబెట్టడం వల్ల వాటి పెంకు తీయటం సులభంగా ఉంటుంది.

3 / 5
అలాగే, చాలా మంది కోడిగుడ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. నేరుగా వంటకు ఉపయోగిస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు. మొదటగా వాటిని గది ఉష్ణోగ్రతకు తీసుకురావాలి. ఆ తర్వాత వాటిని ఉడకబెట్టాలి. మీరు చల్లటి గుడ్లను నేరుగా వేడి నీటిలో ఉడకబెట్టినట్లయితే అవి పగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

4 / 5
గిన్నెలో నీరు మరుగుతుండగా గుడ్లు ఎప్పుడు అందులో వేయకూడదు. అలావేస్తే గుడ్డు నీటిలోనే పగిలిపోతాయి. ఒక గిన్నెలో 3-4 గుడ్ల కంటే ఎక్కువ ఉడకబెట్టకూడదు. ఇలా కూడా అవి పగిలిపోయే అవకాశం ఉంటుంది.

5 / 5
ఇకపోతే, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఎక్కువ మంట మీద ఉడికించొద్దు. మీడియం వేడి మీద మరిగించాలి. మీరు ఇలా చేస్తే, అది పగలకుండా ఉంటుంది. సుమారు 15 నిమిషాలు ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు గుడ్లను వేడి నీటిలో నుంచి తీసి చల్లటి నీటిలో వేయాలి. సుమారు 10 నిమిషాల తరువాత వాటి పెంకులు తీయాలి. గుడ్డు పగలకుండా ఈజీగా వచ్చేస్తుంది.