
ప్రేమ.. రెండు మనసుల కలయిక. కోపాలు... అలకలు.. బుజ్జగింపులు ఇలా ఎన్నో భావోద్వేగాల మధ్య అందమైన జీవితమే. అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే బంధంలో విభేదాలు రావడం సహజం. అందుకు మనస్సులు.. ఆలోచనలే కాదు.. వాస్తు కూడా కారణం. మరి ఎలా ఇబ్బందులను ఎదుర్కొవాలో తెలుసుకుందామా.

ప్రేమలో విభేదాలు.. చిరాకు.. కోపాలు తరచూ ఎదురవుతుంటే రెండు మనసులు తీవ్రమైన దుఃఖంతో ఉంటాయి. భార్యభర్తల మధ్య గొడవలు తగ్గించుకోవడానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటారు. మరి అందుకు చేయాల్సిన వాస్తు మార్పులు ఎంటో తెలుసుకుందామా.

ఇంట్లో మంచం ఎప్పుడూ దక్షిణం వైపు లేదా నైరుతి వైపు ఉండాలి. ఇలా చేస్తే భార్యభర్తల మధ్య గొడవలు తగ్గుతుతాయి.

బెడ్ రూమ్ ఆకారం లేదా రకం చతురస్రంగా ఉండాలి. టేబుల్స్ తీసివేయడం.. వస్తువులు పగలగొట్టడం చేయకూడదు.

ఒక చెక్క మంచం, మంచం మీద ఆకులు ఉన్న దుప్పట్లు ఉపయోగించకూడదు

గోడ రంగును ఎప్పుడూ కాంతివంతంగా ఉంచాలి. పర్యావరణం పరిశుభ్రంగా ఉండాలి.

ప్రేమికుడు ఎప్పుడూ అమ్మాయిల కుడివైపున ఉండాలి.

మంచానికి ఎదురుగా అద్దం పెట్టకూడదు. దీంతో కుటుంబంలో శాంతి ఉండదు.

పడగగదిలో ఏ దేవతా విగ్రహాన్ని ఉంచకూడదు.