Andhra Pradesh: శ్రావణమాసం సందర్భంగా మార్కెట్లో పూల ధరలకు రెక్కలు..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా శ్రావణమాస శోభ తో పూల మార్కెట్లన్నీ కలకలాడుతూన్నాయి అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాలోని కిలో చామంతి పూల ధర 400 రూపాయలు పలుకుతున్నాయి. దీంతో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకునే మహిళలు అధిక ధరలతో ఇబ్బందులు పడుతున్నారు. కడియం హోల్‌సెల్ పూల మార్కెట్లకు భారీగా ఎగుమతులు జరగడంతో బహిరంగ మార్కెట్లో చామంతి , బొండు గులాబీల ధరలు 500 రూపాయల వరకు పలుకుతున్నాయి.