Countries Without Airports: ఇప్పటికీ విమానాశ్రయం లేని దేశాలున్నాయని మీకు తెలుసా? అవి ఇవే..!

|

Feb 26, 2023 | 3:47 PM

ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇప్పటికీ విమానాశ్రయాలు లేవు. అయినప్పటికీ.. ఈ దేశాలకు పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి. విమానాశ్రయాలు లేని దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6
ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఇప్పటికీ విమానాశ్రయాలు లేవు. అయినప్పటికీ ఈ దేశాలకు పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి.

2 / 6
వాటికన్ సిటీ: ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశం, అతి తక్కువ జనాభాతో, విమానాశ్రయానికి తగినంత స్థలం లేదు. ప్రపంచంలోనే అతి చిన్న దేశంగా గుర్తింపు పొందింది ఈ దేశం. మీరు ఇక్కడికి విమానం ద్వారా వెళ్లాలంటే.. ఈ దేశానికి సమీపంలోని విమానాశ్రయాలు Ciampino, Fiumicino లకు చేరుకుని, అక్కడి నుంచి 30 నిమిషాలు రైలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

3 / 6
అండోరా: ఇది పెద్ద దేశమైనప్పటికీ.. ఇక్కడ ఉండే ఎత్తైన పర్వతాల కారణంగా విమానాశ్రయాల ఏర్పాటుకు, విమాన ప్రయాణాలకు ఆటంకిగా మారింది.

4 / 6
శాన్ మారినో: శాన్ మారినో ప్రపంచంలోని పురాతన దేశాలలో ఒకటి. ఇటలీకి సమీపంలో ఉంది. ఇది చాలా చిన్న దేశం. ఈ దేశంలో విమానాశ్రయం లేదు. శాన్ మెరినో మొత్తం మైదానంగా, భారీ రోడ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ప్రజలు సాన్ మెరినో నుండి ఇటలీకి రోడ్డు మార్గంలో ప్రయాణించవచ్చు. సమీప విమానాశ్రయం ఇటలీలోని రిమిని విమానాశ్రయం.

5 / 6
మొనాకో: వాటికన్ సిటీ తర్వాత ప్రపంచంలోనే అతి చిన్న దేశం మొనాకో. దేశం చుట్టూ మూడు వైపులా ఫ్రాన్స్ ఉంది. దీనికి స్వంత విమానాశ్రయ సౌకర్యం లేదు.

6 / 6
లీచ్టెన్‌స్టెయిన్: ఈ దేశం చిన్నది, చాలా కొండలతో కూడి ఉంటుంది. ఈ దేశం మొత్తం చుట్టుకొలత కేవలం 75 కిలోమీటర్లు. లీచ్టెన్‌స్టెయిన్‌కు విమానాశ్రయం లేదు. కానీ కారు, బస్సుల ద్వారా దాదాపు 120 కి.మీ దూరంలో ఉన్న జ్యూరిచ్ విమానాశ్రయం ఈ దేశానికి అత్యంత సమీపంలో ఉంది.