అయితే ఇంటి అవసరాల కోసం వాడే ఫ్రిజ్‌ల ఇంధన వినియోగానికి సంబంధించిన వివరాలు వెల్లడించాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ సంస్థ తెలిపింది. ఇందుకు కొన్ని నిబంధనలను విడుదల చేసింది. ఇక నుంచి ప్రతి ఫ్రిజ్‌పై కొన్ని వివరాలు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. అవి ఏంటంటే 1. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ లోగో, 2. తయారీదారు లేదా దిగుమతిదారు పేరు, 3. బ్రాండ్‌పేరు, 4. మొత్తం సామర్థ్యం (వాల్యూమ్), 5. మోడల్ నంబర్, 6. తయారీ, దిగుమతి చేసుకున్న సంవత్సరం, 7. యునిక్ సిరీస్ కోడ్, 8. ఏడాదికి ఎన్ని యూనిట్ల విద్యుత్తు ఖర్చు చేస్తుందనే వివరాలు, 9. స్టార్ లెవెల్, 10. లేబుల్ పీరియడ్ ఇలా పై వివరాలన్నీ తప్పనిసరిగా పొందుపరచాలని కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది.