Fenugreek Seeds for Hair: ఒత్తైన నల్లని కురులు కావాలా? అయితే మెంతి గింజలను ఇలా వాడి చూడండి..

|

Apr 09, 2024 | 8:19 PM

మగువలకు కురులే అందం. ఒత్తైన నల్లని జుట్టుని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. జుట్టు సంరక్షణ కోసం నిత్యం ఎన్నో చిట్కాలు ట్రై చేస్తుంటారు. పార్లర్‌కు వెళ్లి డబ్బు ఖర్చు చేసినా ప్రయోజనం ఉండదు. వంట గదిలో ఉండే మెంతి గింజలతో మెరిసే జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు. మెంతి గింజల ద్వారా దట్టమైన, అందమైన జుట్టు పొందవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. జుట్టు సంరక్షణలో వీటిని ఎలా ఉపయోగించాలంటే.. మెంతి గింజల్లో ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి..

1 / 5
మగువలకు కురులే అందం. ఒత్తైన నల్లని జుట్టుని ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదు. జుట్టు సంరక్షణ కోసం నిత్యం ఎన్నో చిట్కాలు ట్రై చేస్తుంటారు. పార్లర్‌కు వెళ్లి డబ్బు ఖర్చు చేసినా ప్రయోజనం ఉండదు. వంట గదిలో ఉండే మెంతి గింజలతో మెరిసే జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు.

2 / 5
మెంతి గింజల ద్వారా దట్టమైన, అందమైన జుట్టు పొందవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. జుట్టు సంరక్షణలో వీటిని ఎలా ఉపయోగించాలంటే.. మెంతి గింజల్లో ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ జుట్టుకు చాలా అవసరం. కాబట్టి మెంతులు అనేక జుట్టు సమస్యలను పరిష్కరించగలవు.

3 / 5
ఈ ప్రత్యేకమైన మెంతి గింజలు.. జుట్టు రాలడం, చుండ్రు బాధల నుంచి పొడి నిర్జీవమైన జుట్టు వరకు అన్ని సమస్యలకు చెక్‌  పెడతాయి. ముందుగా గుప్పెడు మెంతి గింజలను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే లేచి వాటిని వడకట్టాలి. ఆ తర్వాత ఆ నీటిని ఉదయం పరగడుపున త్రాగాలి. ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే మెంతుల్లోని పోషకాలు జుట్టుకు అందుతాయి.

4 / 5
రాత్రంతా నానబెట్టిన మెంతి గింజలను సలాడ్లలో కూడా వేసుకుని తినవచ్చు. అలాగే మెంతి గింజలను పప్పు, కూరగాయలలో కూడా ఉపయోగించవచ్చు. ఇందు కోసం ముందుగా ఈ విత్తనాలను తేలికగా వేయించాలి. తర్వాత వీటిని పప్పు లేదా ఏదైనా వెజిటబుల్ కర్రీలో కలిపి తినవచ్చు. మెంతి గింజలను రుబ్బి, పొడిగా చేసుకుని వంటకాలలో ఉపయోగించవచ్చు.

5 / 5
నానబెట్టిన మెంతి గింజల నీటిని వడకట్టిన తర్వాత, స్ప్రే బాటిల్‌లో నింపి, ఉదయాన్నే హెయిర్ స్ప్రే లాగా జుట్టుకు అప్లై చేసినా మంచి ఫలితం ఉంటుంది. కొంత సమయం తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇది జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది.