Double Egg Noodles: అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైల్ డబల్ ఎగ్ నూడిల్స్.. ఇంట్లోనే ఎంతో ఈజీగా ఇలా తయారు చేసుకోండి!

Updated on: Aug 03, 2026 | 12:39 PM

Double Egg Noodles Recipe: సాయంత్రం కాగానే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ గుర్తొచ్చే స్నాక్స్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎగ్ నూడిల్స్ ఒకటి. వీధి చివర ఫాస్ట్ ఫుడ్ బళ్ల వద్ద నుంచి వచ్చే ఆ ఘుమఘుమలు, స్మోకీ ఫ్లేవర్ నోరూరిస్తుంటాయి. అయితే బయట వాడే నూనెలు, టేస్టింగ్ సాల్ట్ ఆరోగ్యానికి అంత మంచివి కావు.

1 / 5
అందుకే బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో దొరికే అదే పర్ఫెక్ట్ రుచితో, ఎంతో పరిశుభ్రంగా ఇంట్లోనే 'డబల్ ఎగ్ నూడిల్స్' సులభంగా తయారు చేసుకోవచ్చు. ఐరన్ బాండీలో హై ఫ్లేమ్‌పై వండితే బయట కొనుక్కునే నూడిల్స్‌ కంటే అద్భుతమైన రుచి సొంతమవుతుంది.

2 / 5
ఈ డబల్ ఎగ్ నూడిల్స్ తయారీ కోసం ముందుగా ఒక పాత్రలో నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు, ఒక చెంచా నూనె వేసి మరిగించాలి. నీళ్లు మరిగాక 150 గ్రాముల నూడిల్స్ వేసి 80% వరకు మాత్రమే ఉడికించాలి. నూడిల్స్ మెత్తపడకుండా ఉడికిన తర్వాత నీటిని వడకట్టి, వెంటనే చల్లటి నీళ్లతో కడిగి పొడిపొడిగా ఆరబెట్టుకోవాలి.

3 / 5
నూడిల్స్ ఆరేలోగా ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికం, క్యాబేజీలను పొడవుగా, సన్నగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్‌లో రెండు గుడ్లు కొట్టి వేసి కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా బీట్ చేయాలి. స్టవ్ మీద ఐరన్ బాండీ పెట్టి రెండు చెంచాల నూనె వేసి బాగా కాగాక, బీట్ చేసిన గుడ్డు మిశ్రమాన్ని వేసి ఆమ్లెట్‌లా రానివ్వాలి. ఆమ్లెట్ కాలిన తర్వాత కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.

4 / 5
ఇప్పుడు అదే ఐరన్ బాండీలో మరికొద్దిగా నూనె వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత కట్ చేసిన క్యారెట్, క్యాప్సికం, క్యాబేజీ, ఉల్లిపాయ ముక్కలు వేసి హై ఫ్లేమ్‌పై ఒక్క నిమిషం పాటు వేయించాలి. కూరగాయలు పూర్తిగా వేగకుండా కరకరలాడుతూ ఉండాలి. ఆ తర్వాత ఉడికించిన నూడిల్స్ వేసి ఉప్పు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా వేసి బాగా కలపాలి.

5 / 5
చివరగా ఒక చెంచా వెనిగర్, ఒకటిన్నర చెంచాల సోయాసాస్ మరియు వేయించిన ఎగ్ ముక్కలు వేసి హై ఫ్లేమ్‌పై టాస్ చేస్తూ బాగా మిక్స్ చేస్తే నోరూరించే డబల్ ఎగ్ నూడిల్స్ రెడీ అవుతాయి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే అమృతంలా ఉంటాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us