ఈ శివాలయం దేశంలోనే ప్రత్యేకం..! ఇక్కడి నంది విగ్రహం రోజు రోజుకూ పెరుగుతోంది..!! రహస్యం ఏంటంటే..

|

Apr 29, 2023 | 8:54 PM

భారతదేశంలోని అనేక దేవాలయాలు ఎన్నో అద్భుతాలు, రహస్యాలతో నిండి ఉన్నాయి. వీటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీ యాగంటి ఉమా మహేశ్వర ఆలయం. దీనిని 15వ శతాబ్దంలో సంగమ వంశానికి చెందిన రాజు హరిహర బుక్క నిర్మించారు. ఈ దేవాలయం ఇక్కడ ఉన్న నంది విగ్రహం ప్రఖ్యాతి పొందింది.

1 / 7
ఆలయంలో ఉన్న నందీశ్వరుడి విగ్రహం నిగూఢమైన రీతిలో నిరంతరం పెరుగుతూ పోతుందని చెబుతారు. నంది విగ్రహం ఆకారం ప్రతి 20 సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతోంది. దీని కారణంగా ఆలయంలోని అనేక స్తంభాలను కూడా తొలగించాల్సి వచ్చింది.

2 / 7
నంది విగ్రహం అసలు పరిమాణం చాలా చిన్నదని, అయితే దాని పరిమాణం పెరుగుతుండడంతో పురాత్తత్వా శాఖ దీనిపై పరిశోధనలు చేసింది. నంది విగ్రహం విస్తరిస్తుందని వారు తేల్చారు. అటువంటి రాయితోనే ఇక్కడి నంది విగ్రహాన్ని తయారు చేసినట్లు పరిశోధనలో వెల్లడైంది.

3 / 7
పురాతన కాలంలో అగస్త్య మహర్షి ఈ ప్రదేశంలో వేంకటేశ్వరుని ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడని, అయితే ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించే సమయంలో విగ్రహం కాలి గోరు విరిగిందని చెబుతారు. అగస్త్య మహర్షి శివుని గురించి తపస్సు చేసాడు. ఆ తరువాత శివుని ఆశీర్వాదంతో అగస్త్య మహర్షి ఉమా మహేశ్వరుడిని, నందిని స్థాపించాడని చెబుతారు.

4 / 7
ఈ ఆలయంలో పుష్కరిణి అనే చెరువు కూడా ఉంది. ఇక్కడ నంది నోటి నుండి నీరు నిరంతరం వస్తుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. అగస్త్య మహర్షి ఈ చెరువులో స్నానం చేసిన తర్వాతే శివుడిని పూజించాడని చెబుతారు.

5 / 7
అయితే, ఇక్కడి శివాలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది..ఏ శివాలయంలో అయినా శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. కానీ ఈ యాగంటి ఉమామహేశ్వర ఆలయంలో శివుడు పార్వతీ సమేతంగా ఉండి విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ ఉన్న అనేక విశిష్టతలలో ఇదీ ఒకటి.

6 / 7
ఇక్కడి ఇంకో ప్రత్యేకత ఏంటంటే శివుడికి ఎదురుగా నంది ఉండకుండా కొంచం పక్కకు ప్రతిష్టించబడి ఉంటుంది. కారణమేమంటే ఇక్కడ శివుడితో పాటు శక్తిరూపమైన పార్వతీ కూడా ఉండటమే. శక్తికి ఎదురుగా ఎవరూ నిలబడలేరు కాబట్టే నందీశ్వరుడు పక్కకు ప్రతిష్టించబడి ఉంటాడు.

7 / 7
ఈ ఆలయంలో పుష్కరిణి అనే చెరువు కూడా ఉంది. అగస్త్య మహర్షి ఈ చెరువులో స్నానం చేసిన తర్వాతే శివుడిని పూజించాడని చెబుతారు.