
కిడ్నీ సమస్యలు ఉన్నవారు కివి పండ్లకు దూరంగా ఉండాలి. వాస్తవానికి కివిలో పొటాషియం ఉంటుంది. ఇది మూత్రపిండాల వ్యాధులతో బాధపడే వారిపై మరింత ఎఫెక్ట్ చూపుతుంది. అందుకే.. కిడ్నీ రోగులు ఆహారంలో పొటాషియం తక్కువ మొత్తంలో తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు.

కివి పండ్లను అతిగా తినటం వల్ల కూడా కొన్ని రకాల సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. దీంతో చర్మంపై దద్దుర్లు, వాపు, దురద, ఉబ్బసం మొదలైన అనేక రకాల అలెర్జీ సమస్యలు వస్తాయి. కొందరిలో నోటి అలెర్జీ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది. దీంతో నోరు, పెదవులు, నాలుక ఉబ్బుతాయి.

Kiwi Fruit

కివి ఎక్కువగా తినడం వల్ల కూడా తీవ్రమైన ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. ఈ సమస్యలో క్లోమం వాపు రావచ్చు. అలాంటి వారు తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కివిలో ఉండే అధిక ఫైబర్ విరేచనాలు, కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలను కలిగిస్తుంది.

గర్భిణీ స్త్రీలు ఒక రోజులో రెండు లేదా మూడు కివిలకు మించి తినకూడదు. కివి ఎక్కువగా తీసుకోవడం వల్ల అసిడిటీ, చర్మంపై దద్దుర్లు, గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంది. అలాగే, గ్యాస్ట్రిటిస్, జీర్ణక్రియకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే కివి తినకూడదు. కివిలో ఉండే యాసిడ్ ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.