AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ బెడ్‌రూమ్‌లో ఈ ఒక్క మొక్క ఉంటే చాలు.. ఆరోగ్యం, ప్రశాంతత మీ సొంతం!

ఇంటిని అందమైన మొక్కలతో అలంకరించుకోవడం ఇప్పుడు ఒక ట్రెండ్‌గా మారింది. అయితే,కొన్ని మొక్కలు కేవలం అందాన్ని ఇవ్వడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిలో ఇంగ్లీష్ ఐవీ (English Ivy) మొక్క ఒకటి. ముఖ్యంగా దీనిని మీ బెడ్‌రూమ్‌లో ఉంచుకోవడం వల్ల ఎలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం:

Jyothi Gadda
|

Updated on: Jul 04, 2026 | 9:12 AM

Share
గాలిని స్వచ్ఛంగా మారుస్తుంది (Air Purifier): ఇంగ్లీష్ ఐవీ మొక్క సహజమైన ఎయిర్ ప్యూరిఫైయర్‌గా పనిచేస్తుంది. ఇది గది వాతావరణంలో ఉండే ప్రమాదకరమైన రసాయనాలు, టాక్సిన్స్‌ను సమర్థవంతంగా తొలగిస్తుంది. గాలిని పూర్తిగా శుద్ధి చేయడం వల్ల శ్వాసకోస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి.

1 / 5
ఇంట్లో బూజును నివారిస్తుంది (Reduces Mold): చాలామంది ఇళ్లల్లో ముఖ్యంగా వర్షాకాలంలో లేదా తేమ ఎక్కువగా ఉన్నప్పుడు గోడలకు, మూలలకు బూజు పట్టడం చూస్తుంటాం. ఈ బూజు వల్ల అలర్జీలు వస్తాయి. ఇంగ్లీష్ ఐవీ మొక్క గదిలో ఉండే అదనపు తేమను (Moisture) పీల్చుకుంటుంది. దీనివల్ల ఇంట్లో బూజు పట్టే సమస్య ఉండదు.

2 / 5
రాత్రి వేళల్లో ఆక్సిజన్ ఇస్తుంది: సాధారణంగా చాలా మొక్కలు రాత్రి సమయంలో కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాయి. కానీ ఇంగ్లీష్ ఐవీ ప్రత్యేకత ఏంటంటే, ఇది రాత్రిపూట కూడా గదిలోని కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుని, స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. దీనివల్ల గదిలో గాలి నాణ్యత పెరుగుతుంది.

3 / 5
ప్రశాంతమైన నిద్ర (Better Sleep): ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమి (Insomnia) సమస్యతో బాధపడుతున్నారు. బెడ్‌రూమ్‌లో ఈ మొక్కను ఉంచడం వల్ల గది ప్రశాంతంగా మారుతుంది. స్వచ్ఛమైన ఆక్సిజన్ అందడం వల్ల మైండ్ రిలాక్స్ అయ్యి రాత్రిపూట గాఢమైన, మంచి నిద్ర పడుతుంది.

4 / 5
ఒత్తిడిని తగ్గించి అందాన్ని ఇస్తుంది: పచ్చని మొక్కలను చూడటం వల్ల మనస్సులోని ఆందోళన, మానసిక ఒత్తిడి తగ్గి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అంతేకాకుండా, ఈ మొక్క బెడ్‌రూమ్‌కు ఒక విభిన్నమైన, సహజమైన లగ్జరీ లుక్‌ను తీసుకొస్తుంది. ఈ మొక్కను పెంచడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. దీనికి ఎక్కువ సూర్యరశ్మి గానీ, ప్రతిరోజూ నీళ్లు గానీ అవసరం లేదు. చాలా తక్కువ సంరక్షణతో ఇండోర్ ప్లాంట్‌గా ఇది అద్భుతంగా పెరుగుతుంది. కాబట్టి, మీ బెడ్‌రూమ్‌లో ఈ చిన్న మార్పు చేసి ఆరోగ్యాన్ని పెంచుకోండి.

5 / 5
Follow Us