
మీరు బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ ప్లేట్‌లో గుడ్డు ఉండాల్సిందే. ఒక ఉడికించిన గుడ్డులో కేవలం 70-80 కేలరీలు మాత్రమే ఉంటాయి. గుడ్డు తింటే కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది, దీనివల్ల అనవసరమైన స్నాక్స్ తినాలనే కోరిక తగ్గుతుంది. గుడ్లలోని పోషకాలు మెటబాలిజంను వేగవంతం చేసి బరువు తగ్గడంలో సహాయపడతాయి.

జిమ్‌కు వెళ్లేవారు లేదా బాడీ బిల్డింగ్ చేసేవారికి చికెన్ అద్భుతమైన ఆహారం. 100 గ్రాముల చికెన్ బ్రెస్ట్‌లో దాదాపు 31 గ్రాముల అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ ఉంటుంది. స్కిన్‌లెస్ చికెన్‌లో కొవ్వు తక్కువగా ఉండి కండరాల పెరుగుదలకు, మరమ్మత్తుకు అవసరమైన అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

గుడ్లు కేవలం ప్రోటీన్ మాత్రమే కాదు, మరిన్ని లాభాలను అందిస్తాయి. ఇందులోని కోలిన్ జ్ఞాపకశక్తిని పెంచి నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కంటి చూపును మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఇవి నియంత్రిస్తాయి.

చికెన్‌లోని నియాసిన్ శక్తి ఉత్పత్తికి, మెదడు పనితీరుకు తోడ్పడుతుంది. ఇందులోని సెలీనియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. విటమిన్ బి6, సెలీనియం రోగనిరోధక శక్తిని పెంచి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

చికెన్, గుడ్లు రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవే. మీరు బరువు తగ్గాలనుకుంటే గుడ్లకు ప్రాధాన్యత ఇవ్వండి. అదే కండరాలు పెంచుకోవాలనుకుంటే చికెన్‌ను డైట్‌లో చేర్చుకోండి. అయితే వీటిని నూనెలో వేయించి కాకుండా ఉడికించి తీసుకోవడం వల్ల పూర్తి పోషకాలు అందుతాయి.