
గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల శరీరానికి కావలసిన ప్రొటీన్లు అందుతాయి. ఉడకబెట్టిన గుడ్లు, గుడ్డు ఆమ్లెట్, ఎగ్ పోచ్ -వంటి వెరైటీలు చేసుకుని తినటం అలవాటు.

ఎలర్జీ సమస్యలు ఉన్నవారు గుడ్లను రుచి చూసేందుకు కూడా ఇష్టపడరు. కానీ, గుడ్లతో చాలా రుచికరమైన వంటకాలను తయారు చేసుకోవచ్చు. అయితే ఈసారి గుడ్లు వాడకుండానే ఆమ్లెట్ తయారు చేసుకోవచ్చు.

వినడానికి ఆశ్చర్యంగా ఉందా? ఈ వంటకం చాలా సులభం. మీరు దీన్ని అల్పాహారం లేదా టిఫిన్ కోసం చేయవచ్చు. ఇందుకు 1/2 కప్పు జున్ను, 1/2 కప్పు మైదా, బేకింగ్ సోడా. వెన్న ఉంటే చాలు..

ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, టొమాటో ముక్కలు, చిన్న ముక్కలుగా తరిగిన బంగాళదుంపలు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, పాలు వేయాలి.

శెనగపిండి, మైదా, బేకింగ్ సోడా, పాలు కలిపి పిండిని తయారు చేయండి. పాన్‌లో వెన్న వేసి, పిండిని పోసి వెడల్పుగా దోశలా చేసుకోండి. ఇప్పుడు చిన్న మంట మీద ఉడికించుకోండి.

ఇప్పుడు వేగిన తర్వాత అందులో టొమాటో ముక్కలు, ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, తురిమిన పన్నీర్ వేసి వేయించాలి.

బాగా ఉడికిన తర్వాత ఆమ్లెట్ రోల్ రూపంలో చుట్టుకుని సర్వ్ చేసుకోండి. ఈ ఆమ్లెట్ చిరుతిండిగా చాలా బాగుంటుంది. పిల్లల టిఫిన్‌లో కూడా చేసుకోవచ్చు.

మీరు గుడ్లు లేకుండా ఈ ఆమ్లెట్ తయారు చేసుకోవచ్చు. వెజిటబుల్ ఆమ్లెట్ చాలా రుచికరమైన స్నాక్ ఐటమ్