Egg Yolk Benefits: గుడ్డు తెల్ల సొనని తిని.. పచ్చసొనని పడేస్తున్నారా.. ఎన్ని ప్రయోజనాలు మిస్ అవుతున్నారో తెలుసా..

|

Mar 01, 2024 | 11:25 AM

గుడ్డు సంపూర్ణ ఆహారం. గుడ్డుని రకరకాలుగా తినే ఆహారంలో చేర్చుకుంటారు. అయితే బరువు తగ్గేవారు గుడ్డులోని తెల్లసొన మాత్రమే తింటారు. అయితే బరువు పెరగాలనుకున్న వారు పచ్చసొన తినడం మంచిది. అయితే గుడ్డులోని పచ్చసొన తినడం ఆరోగ్యకరమా లేదా అన్న అనుమానం చాలామందిలో ఉంది. అయితే గుడ్డు పచ్చసొన తినడం సరికాదా? శరీరానికి హాని చేస్తుందా లేదా గుడ్డు పచ్చ సొన ఇచ్చే ప్రయోజనాలు అనేకం.

1 / 8
ఉడకబెట్టిన గుడ్లు తినేటప్పుడు చాలా మంది పచ్చసొనను తొలగిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే గుడ్డులోని తెల్లటి భాగాన్ని మాత్రమే ఎక్కువగా తింటారు. అదే ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావిస్తారు. దీంతో పచ్చ సోనని పక్కకు పెట్టేస్తారు. మీరు ఆ జాబితాలో ఉన్నారా? అయితే ఈ రోజు అది ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

2 / 8
 వాస్తవానికి గుడ్డు పచ్చసొనతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుడ్డు పచ్చసొనలో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం, ఒమేగా-3 ఫ్యాటీ ఉంటాయి. ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.

3 / 8
అయితే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే గుడ్డులోని పచ్చసొనను తక్కువగా తీసుకోవడం మంచిది. మరోవైపు పచ్చసొన వల్ల కలిగే ప్రయోజనాలను చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి.

4 / 8
గుడ్డు సొనలో విటమిన్ డి, విటమిన్ ఎ, విటమిన్ ఇ, సెలీనియం వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. గుడ్డు సొనలో కోలిన్ కూడా ఉంటుంది, ఇది మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది.

5 / 8
గుడ్డు పచ్చ సొనలో యాంటీ ఆక్సిడెంట్లు అయిన లుటిన్, జియాక్సంతిన్ ఉంటాయి. ఇవి కంటి చూపును కాపాడుకోవడంలో సహాయపడతాయి. అతినీలలోహిత కిరణాల వంటి ప్రమాదకరమైన అధిక-శక్తి తరంగాల నుంచి కళ్ళను కాపాడతాయి. కనుక కంటి చూపు తక్కువగా ఉంటే.. తినే ఆహారంలో ఇక నుంచి గుడ్డు తో పాటు పచ్చసొనను కూడా చేర్చుకోండి.

6 / 8
గుడ్డు పచ్చసొనలో నాణ్యమైన ప్రొటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ రోజంతా శక్తిని అందించడంలో సహాయపడుతుంది. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి.

7 / 8
అలాగే, మీరు విడిచిపెట్టిన పచ్చసొనలో ఉండే విటమిన్ డి కాల్షియం శోషణలో సహాయపడుతుంది. ఎముకలను బలపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి.

8 / 8
అయితే, గుడ్డు పచ్చసొనలో డైటరీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది, ఇది అధిక కొలెస్ట్రాల్ స్థాయిలకు దారితీస్తుంది. కాబట్టి గుడ్డు పచ్చసొన ఎక్కువగా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది.