Health Tips: నోరూరించే నిల్వ ఉంచిన పచ్చడి అతిగా తింటున్నారా..? అయితే, త్వరలో ఆస్పత్రిలో చేరటం ఖాయం..!

|

Jul 16, 2024 | 5:05 PM

భారతీయులకు ఊరగాయ లేనిదే ఎన్ని రకాల ఆహారాలు వడ్డించినా ఆ భోజనం అసంపూర్ణమనే చెప్పాలి. ఆహారం రుచిని పెంచడానికి ఊరగాయలను వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. వివిధ కూరగాయలు, పండ్లతో నిల్వ పచ్చళ్లు తయారు చేస్తారు. దానికి ఉప్పు, నూనె, మసాలా దినుసులు ఎక్కువ పరిమాణంలో వేసి తయారు చేస్తారు కాబట్టి..ఊరగాయలు చూడడానికి ఎర్రగా నోరూరిస్తూంటాయి. పచ్చళ్లు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. కానీ, ఊరగాయలు ఎక్కువగా తింటే అతి త్వరగా ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పచ్చళ్లలో ఉప్పు, నూనె, మసాలాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి, ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు, బీపీ పేషంట్లు, గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బందిపడుతున్న వారికి మంచిది కాదంటున్నారు. నిల్వ పచ్చళ్ల వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం..

1 / 6
పచ్చళ్ళలో అధిక మొత్తంలో ఉండే కారం, ఉప్పు, నూనెలు బీపీని పెంచుతాయి.  బ్లడ్ ప్రెషర్ పెరగడంతో అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. రోజు తినాలనిపిస్తే తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉండదు.

2 / 6
నిత్యం నిల్వ పచ్చడిని ఆహారంలో తీసుకుంటే మొలల సమస్య ఉన్నవారికి సమస్య మరింత ఇబ్బందిని కలిగిస్తుంది. కనుక మొలల సమస్య ఉన్న వాళ్లు పచ్చళ్ళకు దూరంగా ఉండడమే మంచిది. ఊరగాయలలో అధిక మొత్తంలో ఉండే కారం, ఘాటు పదార్థాలు ఫైల్స్ సమస్యను మరింత తీవ్రపరుస్తాయి.

3 / 6
ఊరగాయలను ఎక్కువ మొత్తంలో నిత్యం తీసుకుంటూ ఉంటే పొట్టలో, పేగులలో అల్సర్ సమస్యలు ఏర్పడతాయి. ఉరగాయలలో ఉండే అధిక కారం అల్సర్ సమస్యలకు కారణం అవుతుంది.

4 / 6
 నిల్వ పచ్చడిలో అధిక మొత్తంలో ఉండే ఉప్పు, కారం, నూనె కారణంగా జీర్ణాశయ సమస్యలు తీవ్రమవుతాయి. ఊరగాయలలో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. దీని కారణంగా శరీరానికి కావలసిన దానికన్నా ఎక్కువ నీటిశాతం అందించాల్సి వస్తుంది.

5 / 6
ఊరగాయలు ఎక్కువగా తినే వారిలో ఉదరంలో నొప్పి, పిత్తాశయ సమస్యలు ఏర్పడతాయి. కడుపుబ్బరం, కడుపు నొప్పి సమస్యలు ఇబ్బందిని కలిగిస్తాయి. కనుక నిత్యం కూరగాయలు తీసుకునే వాళ్లు ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. లేకపోతే కడుపు సంబంధిత సమస్యలు ఏర్పడతాయి.

6 / 6
ఊరగాయలు కారంగా, ఉప్పుగా, రుచిగా తింటుంటే తినాలనిపిస్తుంది. అయితే ఊరగాయలను ఎక్కువగా తింటే మన శరీరం అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతుంది. శరీర ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఊరగాయలను తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఊరగాయలకు దూరంగా ఉండాలంటే కాస్త కష్టమే కానీ కొన్ని నియమాలను పాటిస్తే ఏలాంటి ఇబ్బంది ఉండదు. అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది.