
Sprout Salad: పెసలు, శనగలు, క్యారెట్, టమాటో, ఉల్లిపాయ, మిరపకాయ, నిమ్మరసం వంటి పలు పదార్థాలు వేసి తయారు చేసే స్ప్రౌట్ సలాడ్ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుంది.

షుగర్ కంట్రోల్: ఉదయం వేళ అల్పాహారంగా మొలకలను తీసుకోవడం చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫలితంగా గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షణ కలుగుతుంది. అంతేకాక రక్తంలో చక్కెర స్థాయి కూడా కంట్రోల్‌లోకి వస్తుంది. ఇందులోని పోషకాలు అందుకు ఎంతగానో సహాయపడతాయి.

జీర్ణక్రియ: మొలకల్లో కరగని ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడమే కాక మలబద్ధకం, అజీర్తి, కడుపు నొప్పి, అసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

బరువు నియంత్రణ: బరువు తగ్గాలనుకునేవారికి ఇది చక్కని ఆహార ఎంపిక. మొలకల సలాడ్‌లోని ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాక ఆకలిని కూడా నియంత్రించి కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.

ఎముకల బలం: ముందుగా చెప్పుకున్నట్లు స్ప్రౌట్ సలాడ్‌లో అనేక రకాల పదార్థాలను ఉపయోగిస్తారు. ఇందులోని విటమిన్స్, మినరల్స్, యాంటీయాక్సిడెంట్లు ఆరోగ్యాన్నే కాక ఎముకల బలాన్ని కూడా మెరుగుపరుస్తాయి. అలాగే ఎముకల మధ్య ఖాళీ కూడా తొలగిపోతుంది.