
గర్భిణీలు ఎంతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా, అందంగా పుట్టాలంటే మంచి ఆహారం తినాలి. పండ్లు, కూరగయాలు, ఆకు కూరలతో పాటు నట్స్ అండ్ విత్తనాలను కూడా తీసుకోవాలి. ముఖ్యంగా గర్భాధారణ సమయంలో గుమ్మడి విత్తనాలు తింటే ఎంతో మంచిది.

Pregnant

గుమ్మడి గింజల్లో జింక్, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్, క్యాల్షియం, పొటాషియం, సెలీనియం, ప్రోటీన్, ఫైబర్, విటమిన్లతో పాటు గుడ్ ఫ్యాట్స్ కూడా లభిస్తాయి. ఇవి బిడ్డ ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

బిడ్డ మెదడు, శరీరం, కండరాలు, కణాలు చక్కగా అభివృద్ధి చెందేందుకు సహాయ పడతాయి. రక్త హీనత సమస్య రాకుండా చేస్తుంది. గుమ్మడి గింజలు తింటే బీపీ, షుగర్ వంటివి రాకుండా ఉంటాయి.

జీర్ణ సమస్యలు కూడా తలెత్తకుండా చేస్తుంది. జీవక్రియను కూడా మెరుగు పరుస్తుంది. మలబద్దకం సమస్య తలెత్తకుండా చేస్తుంది. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ ఖచ్చితంగా వారి డైట్‌లో గుమ్మడి విత్తనాలు ఉండేలా ప్లాన్ చేసుకోండి.