
ఈ ఏడాది ఎండలు విపరీతంగా ఉండున్నాయని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. అందుకు తగ్గట్టుగానే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటలకే ఎండ విపరీతంగా వచ్చేస్తుంది. ఈ ఎండలకు శరీరంలో ఉష్ణోగ్రత లెవల్స్ కూడా పెరిగిపోతాయి. నోటి నుంచి వేడి సెగలు బయటకు వస్తాయి.

ఈ వేడి నుంచి బయట పడాలంటే.. శరీరాన్ని చల్లబరిచే ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా సమ్మర్‌లో ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రాణానికే ముప్పు రావచ్చు. శరీరాన్ని చల్లబరిచే ఔషధం మన ఇంట్లోనే ఉంది. అదే ఉల్లిపాయ.

సాధారణంగా ఉల్లిపాయలను నిత్యం వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. ఉల్లిపాయ లేనిదే కూరకు రుచి రాదు. అయితే వేసవి కాలంలో ఈ ఉల్లిపాయను కూరల్లో కంటే.. పచ్చిది తినడం వల్ల సమ్మర్ హీట్ నుంచి బయట పడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఉల్లిపాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇవి పొటాషియం వంటి అవసరమైన ఎలక్ట్రోలైట్‌లను అందిస్తాయి. శరీరంలో ద్రవ సమతుల్యతను నియంత్రించడంలో హెల్ప్ చేస్తుంది.

ఉల్లిపాయలను మీరు సలాడ్స్‌లో లేదా శాండ్ విచ్ వంటి వాటిల్లో పచ్చివి యాడ్ చేసుకుని తినవచ్చు. ఉల్లిపాయను పెరుగుతో కూడా కలిపి తినొచ్చు. ఇలా ఉల్లిపాయల్ని పచ్చివి తినడం వల్ల.. వడదెబ్బ, చెమట కాయలు, డీహైడ్రేషన్, జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది.