
100 గ్రాముల ఉడకబెట్టిన కందలో చాలా తక్కువ మొత్తంలో క్యాలరీలు ఉండటం వల్ల ఆరోగ్యానికి లాభదాయకం. అలాగే ఇందులో పిండి పదార్థాలు, ఫైబర్, ప్రోటీన్లు, విటమిన్లు బి6, సి, బి9, బి1, బి2, బి3లతోపాటు పొటాషియం, మెగ్నిషియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, కాపర్, మాంగనీస్, ఫ్లేవనాయిడ్స్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా లభిస్తాయి.

ఫైబర్ సమృద్ధిగా ఉండే కందను ఆహారంలో చేర్చుకొంటే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్దకం దూరం చేస్తుంది. ఇది ప్రీ బయోటిక్ ఆహారంగా కూడా పనిచేస్తుంది. దీన్ని తింటే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో అజీర్తి సమస్య ఉండదు. గ్యాస్ తగ్గిపోతుంది. పైల్స్ ఉన్నవారికి మేలు చేస్తుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే అల్సర్లు కూడా నయమవుతాయి.

కంద గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉన్నందున రక్తంలో షుగర్ స్థాయిలు పెరగవు. ఇందులో ఉన్న ఆల్లన్‌టోయిన్ అనే సమ్మేళనం శరీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా ఉపయోగించుకునేలా చేస్తుంది. దీంతో షుగర్ స్థాయిలు తగ్గి డయాబెటిస్ అదుపులో ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారికి కంద ఎంతగానో మేలు చేస్తుంది.

కందలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలో సోడియం స్థాయిలను నిర్వహిస్తాయి. దీంతో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతోపాటు రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. హైబీపీ, గుండె జబ్బులు ఉన్నవారికి కంద ఎంతగానో మేలు చేస్తుంది.

కందను పేరుకు దుంప అయినప్పటికీ క్యాలరీలు చాలా తక్కువగా ఉంటడంతో పాటు ఫైబర్ అధికంగా లబిస్తుంది. ఇది ఎక్కువ సేపు కడుపు నిండిన భావనతో ఉంటారు. దీంతో తక్కువగా తినడం వల్ల బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. దీనిలో ఫ్లేవనాయిడ్స్ యాంటీ ఇన్ ఫ్లామేటరీ కారకాలుగా పనిచేస్తాయి. దీనివల్ల శరీరంలో వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, బీటా కెరోటిన్, ఫినోలిక్ సమ్మేళనాలు ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించి క్యాన్సర్, గుండె జబ్బులు నుంచి రక్షిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.