
చలి రోజుల్లో, ముఖ్యంగా ఉదయం లేదా రాత్రి సమయంలో పెరుగు తినడం మానుకోవాలి. పెరుగులో వేయించిన జీలకర్ర పొడిని జోడించడం వల్ల జీర్ణక్రియకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే, పెరుగులో చక్కెర లేదా ఉప్పు జోడించడం వల్ల దాని రుచి పెరగడమేకాకుండా రెట్టింపు ప్రయోజనాలను అందిస్తుంది.

ముఖ్యంగా ఉదయం పూట పాలు, పెరుగు తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయట.

పెరుగులో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది శరీర శక్తి స్థాయిని పెంచుతుంది. అలాగే మీకు అలసిపోయి బలహీనంగా అనిపిస్తే క్రమం తప్పకుండా పెరుగు తినడం మంచిది.

ఇలా ఖాళీ కడుపుతో పాలు తాగడం, పెరుగు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే ఖాళీ కడుపుతో పాలు, పెరుగు తినకూడదు. ఉదయం ఖాళీ కడుపుతో పాలు తాగడం, పెరుగు తినడం వల్ల ఉబ్బరం, అసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

కొన్నిసార్లు పెరుగులోని ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే ఖాళీ కడుపుతో మాత్రం దీనిని తీసుకోకూడదు. ఇది యాసిడ్ రిఫ్లక్స్‌కు దారితీస్తుంది.