Summer Fruits: భగ భగ మండే వేసవి కాలంలో ఈ పండ్లను తింటే ఎన్నో ప్రయాజనాలు

| Edited By: seoteam.veegam

Apr 04, 2023 | 4:22 PM

ఎండలు మండుతున్నాయి. రోజురోజుకు వేడి దడ పుట్టిస్తోంది. ఈ క్రమంలో కొన్ని పండ్లను తినడం వల్ల మన బాడీకి ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడంలో ఇవి సహాయపడతాయి.

1 / 7
ఊబకాయంతో బాధపడుతూ, బరువు తగ్గేందుకు తెగ కష్టపడుతున్నారా. అయితే, ఆహారంలో ఈ పండ్లను చేర్చుకోవడం ద్వారా ఈజీగా బరువు తగ్గొచ్చు. ఈ పండ్లు తినడం వల్ల ఊబకాయం తగ్గడమే కాకుండా మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్, గుండె జబ్బులు కూడా తగ్గుతాయని పోషకాహార నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎండాకాలంలో ఏయే పండ్లను తింటే.. ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

2 / 7
పుచ్చకాయ: వేసవి కాలం వచ్చిందంటే మార్కెట్లలో పుచ్చకాయలు దర్శనమిస్తుంటాయి. రంగులతో నిండిన ఈ పండు మీ ఆరోగ్యాన్ని కూడా రంగులతో నింపుతుంది. ఇది విటమిన్లు A, C అలాగే ఫైబర్‌కు మంచి మూలంగా ఉంటుంది. పుచ్చకాయ తినడం వల్ల నీటి దాహంతోపాటు ఆకలి కూడా తీరుతుంది. అయితే, పుచ్చకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కాబట్టి డయాబెటిక్ రోగులు దీనిని జాగ్రత్తగా తీసుకోవాలి.

3 / 7
దోసకాయ: దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవి బరువు తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. దోసకాయలో 95 శాతం నీరు ఉంటుంది. అదనంగా, వాటిలో తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. కాబట్టి దోసకాయ బరువు తగ్గడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది.

4 / 7
ఫైనాపిల్: పైనాపిల్ బరువు నియంత్రణలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి, ఫైబర్ ఉంటాయి. ఇది శరీరంలో నీటి కొరతను కూడా తీరుస్తుంది. బరువు పెరగకుండా చేయడంలో సహాయపడుతుంది. దీన్ని జ్యూస్ లేదా సలాడ్‌గా ఉపయోగించవచ్చు.

5 / 7
నారింజ: నారింజలు విటమిన్ సికి మంచి మూలం. దీన్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. అదనంగా, జీవక్రియ కూడా పెరుగుతుంది. ఇది పొటాషియంకు మంచి మూలంగా పనిచేస్తుంది. ఆరెంజ్ తింటే ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు. మళ్లీ మళ్లీ తినే అలవాటును దూరం చేస్తుంది. కాబట్టి బరువు కూడా అదుపులో ఉంటుంది.

6 / 7
కివీ: లోపల ఆకుపచ్చగా, బయట గోధుమ రంగులో ఉండే ఈ కివీ పండులో విటమిన్ సి, ఇ, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండు తినడం వల్ల పదే పదే ఆకలి వేయదు. కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఈ విధంగా ఈ పండ్లు బరువు తగ్గడానికి సహాయపడతాయని రుజువు చేస్తుంది.

7 / 7
బొప్పాయి: బొప్పాయిలో మంచి మొత్తంలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. ఈ పండు తినడం వల్ల జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది. దీనితో పాటు, జీవక్రియ పెరుగుతుంది. దీని కారణంగా మీరు శక్తివంతంగా ఉంటారు.