Women Pregnancy: వీటిని తింటే చాలు.. మహిళల్లో సంతాన సమస్యకు చెక్ పెట్టవచ్చు..
మాతృత్వం ఓ వరం. పిల్లలు కావాలని ఎవరు కోరుకోరు. నేటి యుగంలో పిల్లలు పుట్టడం కోసం అనేక అధునాతనమైన సాంకేతికతను వైద్యరంగంలో ప్రవేశపెట్టారు. సరిగసీ మొదలు టెస్ట్యూబ్ బేబీ వరకు ఎన్నో సరికొత్త విధానాలకు శ్రీకారం చుట్టారు. కొందరు సంతానం కలుగకపోవడం పెద్ద శాపంగా భావించి దిగులు చెందుతూ ఉంటారు.
మాతృత్వం ఓ వరం. పిల్లలు కావాలని ఎవరు కోరుకోరు. నేటి యుగంలో పిల్లలు పుట్టడం కోసం అనేక అధునాతనమైన సాంకేతికతను వైద్యరంగంలో ప్రవేశపెట్టారు. సరిగసీ మొదలు టెస్ట్యూబ్ బేబీ వరకు ఎన్నో సరికొత్త విధానాలకు శ్రీకారం చుట్టారు.
కొందరు సంతానం కలుగకపోవడం పెద్ద శాపంగా భావించి దిగులు చెందుతూ ఉంటారు. అలాంటి వారి కోసం మన సమాజంలో సంతాన సాఫల్య కేంద్రాలు వందల సంఖ్యలో వెలిశాయి. ఇక్కడ సంతానోత్పత్తి జరుగకపోవడానికి గల కారణాలు, వాటి సమస్యలకు పరిష్కారాలను చూపిస్తున్నారు.
అయితే ఇది కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటివి అవసరం లేదు సాధారణంగానే సంతానాన్ని కలుగడం కోసం ఏం చేయాలి అనే సందేహం చాలా మందిలో కలుగ వచ్చు. అలాంటి వారు ఈ ఆహారం తీసుకుంటే చాలు. గర్భాశయంలో ఎలాంటి సమస్యలు లేకపోతే త్వరగా పండండి బిడ్డకు జన్మనిచ్చేందుకు దోహదపడుతుంది.
తల్లి కావాలనుకునే మహిళలకు విటమిన్లు, ఫోలిక్‌యాసిడ్, పోషకాలు, ఐరన్, కాల్షియం, విటమిన్ సి, ఫోలేట్ పుష్కలంగా అవసరం అవుతుంది. శరీరంలో ఐరన్ లోపం ఎన్నట్లయితే అది సంతానోత్పత్తిపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
పచ్చని ఆకు కూరలు తినడం వల్ల పునరుత్పత్తి అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రధానంగా తోటకూర, పాలకూర, బ్రోకలీ, బచ్చలికూర, కొత్తిమీర, బోక్ చోయ్ అధికంగా తీసుకోవడం వల్ల గర్భాశయంలోని భాగాలు చక్కగా పనిచేస్తాయి. వీటిని పచ్చిగా లేదా ఉడికించుకుని అయినా తినవచ్చు. అలా వీలు అవకపోతే ఆలివ్ నూనెలో వేయించుకుని, సైడ్ డిష్‌గా తినాలి. అలా కుదరకపోతే సూప్‌లు, క్యాస్రోల్స్, సలాడ్లు, ఆమ్లెట్లలో టోస్ట్ చేసి తినొచ్చు.
డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కూడా సంతానోత్పత్తికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల త్వరగా గర్భం దాల్చడానికి ఉపయోగపడుతుంది. అలాగే రకరకాల తాజా పండ్లను, డ్రై ఫ్రూట్స్ ను తినడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో పాటు సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. ముఖ్యంగా కివీ, నారింజ, స్ట్రాబెర్రీ వంటి పండ్లను డైలీ రోటీన్ ఫుడ్ లో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.