బయట వర్షం.. చల్లని వాతావరణంలో.. వేడి వేడి బ్రెడ్ పకోడ.. ఇలా చేసి తింటే అదిరిపోద్దీ

Updated on: Sep 23, 2026 | 3:58 PM

బయట వర్షం పడుతుంటే ఎవరికి అయినా సరే వేడి వేడిగా ఏదైనా తినాలి అనిపిస్తుంది. అయితే ఎప్పుడూ చేసుకునే మిర్చీ బజ్జీలు కాకుండా రుచికరంగా ఇలా బ్రెడ్ పకోడ చేస్తే టేస్ట్ అదిరిపోతుందంట. మరి ఈ వర్షంలో మీరు కూడా దీనిని ప్రిపేర్ చేసుకుంటారా? అయితే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి.

1 / 5
బ్రెడ్ పకోడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. రెండు కప్పుల శనగపిండి, ఉప్పు, టీస్పూన్ పసుపు, వాము, కస్తూరి మేతి, వంట సోడా, కారం, ఉప్పు రుచికి సరిపడ, బ్రెడ్ స్లైస్‌లు. గ్రీన్ చట్నీ కోసం ..పుదీనా, చిన్న అల్లం ముక్క, ఆరేడు వెల్లుల్లి రెబ్బలు, రెండు పచ్చిమిర్చి, పావు టీస్పూన్ జీలకర్ర, హాఫ్ టీస్పూన్ ఉప్పు, వన్ స్పూన్ వేయించిన శనగపప్పు, నాలుగు ఐస్ క్యూబ్స్, వన్ స్పూన్ పెరుగు తీసుకోవాలి.

2 / 5
తయారీ విధానంలోకి వెళ్లితే..ముందుగా, ఒక మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల శనగపిండిని తీసుకోవాలి. దీనికి వన్ స్పూన్ ఉప్పు, పావు టీస్పూన్ పసుపు, వన్ స్పూన్ వామును వేసి మంచిగా కలుపుకోవాలి. అలాగే, వన్ స్పూన్ కసూరి మేతి, పావు టీస్పూన్ వంట సోడా వేసి, అన్నీ బాగా  కలుపుకోవాలి. తర్వాత, కొంచెం కొంచెంగా నీరు పోసుకుంటూ, పిండి ముద్దలు లేకుండా బజ్జీల పిండిలా జారుగా కలుపుకోవాలి. చివరగా, పావు టీస్పూన్ కారం, కొంచెం చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత దీనిని పదినిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

3 / 5
బ్రెడ్ బజ్జీకి  ప్రత్యేకమైన రుచిని ఇచ్చే గ్రీన్ చట్నీని తయారు చేసుకోవాలి. దీని కోసం మిక్సీజార్ తీసుకొని, చట్నీ కోసం పైన చెప్పిన అన్ని పదార్థాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా రుబ్బుకోవడం వలన   చట్నీకి మంచి ఆకుపచ్చ రంగు వస్తుంది.  గ్రైండ్ చేసుకున్న తర్వాత, అర టీస్పూన్ నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఈ గ్రీన్ చట్నీని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

4 / 5
ఇప్పుడు  బ్రెడ్ స్లైస్‌లను తీసుకొని, వాటి అంచులు కట్ చేసి,  క్రాస్‌గా ట్రయాంగిల్ ఆకారంలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్లో ఒకదానిపై తయారుచేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీని పల్చగా అప్లై చేయాలి. మరీ ఎక్కువ చట్నీ వేస్తే రుచి ఎక్కువైపోతుంది కాబట్టి చూసుకొని వేయాలి. చట్నీ అప్లై చేసిన బ్రెడ్ పైన మరొక బ్రెడ్ పీస్‌ను పెట్టి, శాండ్‌విచ్ లాగా సిద్ధం చేసుకోవాలి. కావాలంటే టొమాటో సాస్‌ను కూడా చట్నీలా అప్లై చేయవచ్చు.

5 / 5
ఒక బాణలిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న బ్రెడ్ శాండ్‌విచ్‌లను శనగపిండి బ్యాటర్‌లో పూర్తిగా ముంచి, పిండి మొత్తం బ్రెడ్‌కు పట్టేలా చూసుకోవాలి. తర్వాత, నెమ్మదిగా వేడెక్కిన నూనెలో వేయాలి. ఇలాగే ఒక్కొక్కటిగా వేసుకుంటూ, నూనెలో సరిపడా బ్రెడ్ బజ్జీలను వేయించుకోవాలి. బజ్జీల పైన నూనెను పోసుకుంటూ, రెండు వైపులా తిప్పుకుంటూ మంచి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. బజ్జీలు బాగా ఎర్రగా వేగిన తర్వాత, టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లోకి  తీసుకోవాలి. అంతే బ్రెడ్ పకోడా రెడీ.

Loading...
Unable to load recommendations.
Follow Us