
నేడు (సెప్టెంబర్ 09)న శుక్రగ్రహం ఆశ్లేష నక్షత్రంలోని మూడవ స్థానంలోకి ప్రవేశించనుంది. 15వ తేదీ వరకు అదే నక్షత్రంలో కొనసాగనున్నాడు. అయితే దీని వలన నాలుగు రాశుల వారిపై లక్ష్మీ కటాక్షం కలిగి, పట్టిందల్లా బంగారమే కానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

మిథున రాశి : మిథున రాశి వారికి శుక్రగ్రహం నక్షత్ర సంచారం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఎవరైతే చాలా రోజుల నుంచి మంచి జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో, వారికి మంచి జాబ్ దొరికే ఛాన్స్ ఉంది.

వృశ్చిక రాశి : వృశ్చి రాశి వారికి ఇది చాలా అనుకూల సమయం. ఆగిపోయిన పనులు మళ్లీ పున:ప్రారంభించవచ్చు. స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు, రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి, ప్రతి ఒక్కరికీ ఈ సమయం చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి.

కన్యా రాశి : శుక్రుడి కదలికలు కన్యా రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి. ప్రతి రంగంలో ఊహించని విజయాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు తీరిపోయి, వ్యాపారాలు లాభసాటిగా మారే ఛాన్సులు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది, ప్రభుత్వ రంగాలలో పనులు చేస్తున్న వ్యక్తులకు అద్భుతమైన లాభాలు కలుగుతాయి.

తుల రాశి : తుల రాశి వారికి శుక్ర గ్రహ సంచారం వలన అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. మంచి మార్కులు సాధిస్తారు. ఎవరైతే చాలా రోజుల నుంచి నూతన వాహనం కొనుగోలు చేయాలని కలలు కంటున్నారో, వారి కోరిక నెరవేరే ఛాన్స్ ఉంది.