
బార్లీ వాటర్ చాలా హెల్దీ డ్రింక్ అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో ఫైబర్, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ బార్లీనీరు జీర్ణ వ్యవస్థకి మంచి టానిక్‌లా పనిచేస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. బార్లీ నీటిలో శీతలీకరణ గుణాలు ఉన్నాయి. ఇది వేసవిలో శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తుంది.

బార్లీ నీరు జీర్ణ సమస్యలకి ఓ టానిక్‌లా పనిచేస్తుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థని సరిచేస్తుంది. మలబద్ధకానికి మందులా పనిచేస్తుంది. బార్లీనీటిలో డైటరీ ఫైబర్ ఉంటుంది. కాబట్టి, ఇది గట్ ఫ్రెండ్లీ డ్రింక్ అని చెప్పొచ్చు.

బార్లీ నీటిలో ఫైబర్ తగిన మోతాదులో ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి డయాబెటిస్ తో బాధపడేవారు బార్లీ నీటిని తాగడం వలన ఉపయోగాలే తప్ప ఎలాంటి హాని ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు..అధిక రక్తపోటు తో బాధ పడుతున్న వారికి కూడా బార్లీ నీరు తాగడం వలన హై బీపీని కంట్రోల్ చేస్తుంది.

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు బార్లీ నీరు తీసుకోవడం వలన అధిక బరువుని నియంత్రించవచ్చు. అంతేకాదు. బార్లీ నీరు తాగడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ పనితీరు మరింత మెరుగుపడుతుంది. ఛాతీలో మంట ,గ్యాస్ సమస్యతో బాధ పడేవారికి ఈ బార్లీ నీటిని తాగితే కాస్త ఉపశమనం కలుగుతుంది.

బార్లీ నీరు తాగడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగవుతుంది. దీంతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీల్లో రాళ్ల వంటి సమస్యలు తగ్గుతాయి. అదే విధంగా బాడీకి కావాల్సిన హైడ్రేషన్‌ని అందిస్తాయి. ఈ డ్రింక్ లివర్ డీటాక్స్ డ్రింక్‌లా పనిచేస్తుంది. బ్లడ్‌ని ప్యూరిఫై చేస్తుంది.