Summer Drink: వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? ఒంట్లో వేడిని తరమికొట్టే సూపర్‌ డ్రింక్ ఇది..!

|

Apr 26, 2024 | 3:55 PM

వేసవిలో శరీరానికి హైడ్రేషన్ చాలా ముఖ్యం. పుదీనా ఆకులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. పుదీనాలో ఔషధ గుణాలు ఉంటాయి. దీంట్లోని సమ్మేళనాలు శరీర వేడిని తగ్గించి చల్లదనాన్ని ప్రేరేపిస్తాయి. పేగు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. వేసవిలో పుదీనా నీటిని ఎక్కువగా తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
పుదీనా ఆకుల్లో ఉండే మెంథాల్ జీర్ణవ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుంది. అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. ఫలితంగా మెటబాలిజం రేటు పెరిగి బరువు తగ్గడానికి కృషి చేస్తుంది. పుదీనా కేలరీలు తక్కువగా ఉంటాయి. క్రమం తప్పకుండా పుదీనా నీరు తాగుతుంటే మీజిల్స్, రొమ్ము క్యాన్సర్ వంటి పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

2 / 5
జీర్ణక్రియ సరిగా లేనట్లయితే బరువు తగ్గడం అంత సులభం కాదు. ఇది జీవక్రియను నెమ్మదిస్తుంది. కడుపులో అసౌకర్యం, అపానవాయువుకు కారణమవుతుంది. పుదీనా ఆకులకు అజీర్ణం, అపానవాయువు, ఉదర ఆమ్లం వంటి జీర్ణ సమస్యలను నయం చేసే శక్తి ఉంది. పుదీనా ఆకులు సహజంగా ఆకలిని అణిచివేసే గుణం కలిగి ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడం సులభం అవుతుంది. పుదీనా నీటిని క్రమం తప్పకుండా తాగితే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారికి మరింత మేలు చేస్తుంది.

3 / 5
బరువు తగ్గడానికి, శరీరంలోని నీటి శాతం సమతుల్యంగా ఉండాలి. పుదీనా నీరు దాహాన్ని తీర్చడమే కాకుండా రోజంతా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. పుదీనా ఆకులు జీర్ణ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. మెరుగైన మార్గంలో కేలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది సులభంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

4 / 5
పుదీనా నీటిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసేలా పనిచేస్తుంది.  పుదీనా ఆకుల్లోని మెంథాల్.. వేసవిలో ఎండల తీవ్రతకు వచ్చే తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కండరాలను రిలాక్స్‌ చేస్తుంది. పుదీనా టీ తాగినా, దీనితో చట్నీ, కూర చేసుకొని తిన్నా ప్రయోజనం ఉంటుంది.

5 / 5
పుదీనా నీరు సహజమైన డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. పుదీనా నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్‌ను శుభ్రపరచడంతోపాటు బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. దంతాలు, చిగుళ్ల సమస్యకు చెక్‌పెడుతుంది. పుదీనా ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. పుదీనా నీటితో పుక్కిలిస్తే నోటి దుర్వాసన తగ్గుతుంది. సీజనల్ ఇన్‌ఫెక్షన్స్ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.